By: ABP Desam | Updated at : 30 Sep 2023 08:39 AM (IST)
పోయిన పాన్ కార్డ్ కోసం మళ్లీ అప్లై చేయడం చాలా ఈజీ
Lost Pan Card: ఆర్థిక లావాదేవీలు, అమ్మడం & కొనడం, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడం, ఆర్థిక సాధనాల్లో (financial instruments) పెట్టుబడి పెట్టడం, వీసా కోసం దరఖాస్తు చేయడం, బ్యాంక్ ఓపెన్ చేయడం సహా చాలా రకాల పనుల కోసం అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్స్‌లో పాన్ కార్డ్ ఒకటి.
PAN (పర్మినెంట్ అకౌంట్ నంబర్) అనేది.. పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. అంకెలు, ఆంగ్ల అక్షరాల కలయిక ఈ నంబర్. పాన్ కార్డ్‌ను భారత ఆదాయపు పన్ను విభాగం జారీ చేస్తుంది.
Googleలో ట్రెండింగ్‌లో ఉన్న సెర్చ్‌ల్లో... పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే ఏం చేయాలి అనే ప్రశ్న కూడా ఎక్కువగా ఉంటోంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ పోతే దానిని తిరిగి పొందడం సాధ్యమే. పాన్ కార్డ్ మళ్లీ జారీ అవుతుందో, లేదో అన్న భయం అనవసరం.
మీ పాన్ కార్డ్ పోతే.. అది మోసగాళ్లు, సంఘ విద్రోహశక్తుల చేతుల్లో పడితే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. పర్యవసానంగా మీరు చిక్కుల్లో పడతారు. ఈ రిస్క్‌కు అడ్డుకట్ట వేయడానికి, ముందుగా మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) కాపీని పొందాలి. దీనివల్ల మీరు సేఫ్ సైడ్‌లో ఉంటారు.
ఇప్పుడు, నిశ్చింతగా పాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్ కోసం మళ్లీ చేస్తే, మరో కొత్త నంబర్‌తో కార్డ్ రాదు. పాత నంబర్‌తోనే కొత్త కార్డ్ వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, పాన్ అంటేనే పర్మినెంట్ అకౌంట్ నంబర్. ఒక వ్యక్తికి ఒకే నంబర్ ఉంటుంది, దీనిని మార్చడం కుదరదు. ఒకవేళ మీ పాన్ కార్డ్ మీదున్న మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ లేదా పుట్టిన తేదీలో తప్పు ఉంటే, ఆ వివరాలను మార్చుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్:
1. అధికారిక వెబ్‌సైట్ TIN-NSDLకి వెళ్లండి.
2. "చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా/ పాన్ కార్డ్ రీప్రింట్ (నో చేంజెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా)" అప్లికేషన్‌ను ఎంచుకోండి.
3. మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి, ఆ తర్వాత సబ్మిట్ చేయండి.
4. ఇప్పుడు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తుదారు రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు కూడా దీనిని పంపుతారు. ఇప్పుడు అప్లై చేయడాన్ని కంటిన్యూ చేయండి.
5. 'పర్సనల్ డిటైల్స్' పేజీలో మొత్తం సమాచారాన్ని పూర్తి చేయండి. అక్కడ - 'ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ', సబ్మిట్ డిజిటల్లీ వయా e-KYC', 'e-sign' ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటి నుంచి మీకు అనుకూలమైన ఒక ఆప్షన్ ఎంచుకోవాలి.
ఒకవేళ మీరు ఇ-కేవైసీ, ఇ-సైన్ ద్వారా మీ డాక్యుమెంట్స్‌ను డిజిటల్‌గా సమర్పించాలన్న ఆప్షన్స్ ఎంచుకుంటే, ఇక్కడ ఆధార్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. మీరు అందించిన వివరాలను నిర్ధరించుకోవడానికి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఫైనల్ ఫారాన్ని సమర్పించేటప్పుడు, ఆ ఫారం మీద పై ఇ-సైన్ చేయడానికి డిజిటల్ సంతకం అవసరం.
ఇ-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజ్‌లను సబ్మిట్ చేయాలన్న ఆప్షన్ ఎంచుకుంటే, మీ వద్ద తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ ఉండాలి. మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర పత్రాలను స్కాన్ చేసి, ఆ ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత, ఒక OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే దరఖాస్తు ఫారం ధృవీకరణ పూర్తవుతుంది.
6. ఇప్పుడు, 'ఇ-పాన్ కార్డ్' ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇ-పాన్ కార్డ్ కోసం, చెల్లుబాటు అయ్యే ఇ-మెయిల్ ఐడీ అవసరం.
7. మీ కాంటాక్ట్ సమాచారం, డాక్యుమెంట్ వివరాలను ఫిల్ చేసి, దరఖాస్తును సబ్మిట్ చేయండి. ఇక్కడితో అప్లై చేయడం పూర్తవుతుంది, దీనికి సంబంధించిన ఫీజ్ కట్టాల్సి ఉంటుంది.
8. మీరు పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. పేమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే రిసిప్ట్ వస్తుంది. భవిష్యత్ అవసరం కోసం ఆ రిసిప్ట్‌ను దాచుకోండి.
ఇవన్నీ పూర్తయిన తర్వాత, సాధారణంగా 15-20 పని దినాల్లో మీ PAN కార్డ్ జారీ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Small Business Ideas : గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు
Silver Prices : మొదటిసారిగా 3 లక్షలు దాటిన వెండి! ఇప్పుడు 1 కిలో ధర ఎంత ఉందో తెలుసుకోండి?
SBI ATM Transaction Fees:ఎస్బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Ikkis Box Office Collection Worldwide Total: ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!