By: ABP Desam | Updated at : 09 Oct 2023 01:25 PM (IST)
ప్రభుత్వం రన్ చేస్తున్న పెన్షన్ స్కీమ్స్
Pension Schemes For Senior Citizen: సీనియర్ సిటిజన్ల కోసం రకరకాల సంక్షేమ పథకాలను సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తోంది. ముఖ్యంగా, ఉద్యోగం/వృత్తి/వ్యాపారం నుంచి రిటైర్ అయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రక్షణ కల్పించే కొన్ని పథకాలను తీసుకొచ్చింది. నెలనెలా పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అందిస్తాయి. ఈ పథకాల కింద ప్రతి నెలా లేదా నిర్ధిష్ట టైమ్ పిరియడ్‌లో ఆదాయం అందుతుంది, వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.
సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పెన్షన్ స్కీమ్స్:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
దేశ ప్రజల్లో ఎక్కువగా పాపులర్ అయిన స్కీమ్ ఇది. పదవీ విరమణను దృష్టిలో పెట్టుకుని, కొంత మొత్తాన్ని సేవింగ్స్ & ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్లాన్... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. మార్కెట్ ఆధారంగా రాబడిని ఇస్తుంది. ఈ పెన్షన్ ప్లాన్‌ను PFRDA (Pension Fund Regulatory and Development Authority) నిర్వహిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత కూడా జీతం తరహాలో క్రమం తప్పని ఆదాయం & పదవీ విరమణ తర్వాత ఒకేసారి ఎక్కువ మొత్తం డబ్బు, ఈ రెండు ప్రయోజనాలను NPS అందిస్తుంది. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. 60 ఏళ్ల వయస్సు రాగానే ఆ డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. మీకు ఇష్టమైతే 70 సంవత్సరాల వయస్సు కూడా NPS మెంబర్‌గా కొనసాగవచ్చు.
ఇందిరాగాంధీ జాతీయ పాత పెన్షన్ పథకం (వయోవందన స్కీమ్)
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ ఇస్తారు. సీనియర్ సిటిజన్లు, BPL కేటగిరీ పౌరులు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. 60 నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న వారికి నెలకు 350 రూపాయలు; 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి నెలకు 650 రూపాయలు అందిస్తారు. మున్సిపాలిటీలు, పంచాయితీల ద్వారా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అటల్ పెన్షన్ యోజన (APY)
అటల్ పెన్షన్ యోజన కింద నిరుపేద కుటుంబాలకు పింఛను అందజేస్తారు. దీని కింద నెలవారీ పింఛను రూపంలో ఒక వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు ఇస్తారు. చందాదారు భారతదేశ పౌరుడై ఉండాలి, వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆదాయ పన్ను చెల్లించేవాళ్లు ఈ పథకంలో చేరడానికి అర్హులు కాదు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా అటల్ పెన్షన్ యోజన కింద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
సీనియర్ పెన్షన్ బీమా యోజన
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ వెబ్‌సైట్ ప్రకారం, సీనియర్ పెన్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా నిర్వహిస్తున్నారు. దీని కింద, నెలవారీ పెన్షన్ ప్రయోజనం మీరు కట్టిన మొత్తం నుంచి చెల్లిస్తారు.
మరో ఆసక్తికర కథనం: ఆంధ్రప్రదేశ్‌లో తవ్వినంత బంగారం, ఏడాదికి 750 కిలోలు బయటకు తీసేందుకు ప్లాన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?