By: ABP Desam | Updated at : 31 Aug 2022 06:48 AM (IST)
Edited By: Arunmali
బంగారం, వెండి ధరలు 31 ఆగస్టు 2022
Gold - Silver Price: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (మంగళవారం) పోలిస్తే నేడు (బుధవారం) కాస్త మెరిసింది. పది గ్రాముల పసిడి రూ.100-250 మధ్యలో పెరిగింది.
తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ (బుధవారం) రూ.100 పెరిగి రూ.47,250 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.110 పెరిగి రూ.51,540 గా ఉంది. స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.100 పెరిగి రూ.60,100 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు (బుధవారం) రూ.100 పెరిగి రూ.47,250 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కూడా రూ.110 పెరిగి రూ.51,540 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.60,100 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,540 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్, విజయవాడ తరహాలోనే కిలో రూ.60,100 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
దేశంలోని ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు (బుధవారం) రూ.100-250 మధ్యలో పెరిగింది. చెన్నైలో (Gold Rate in Chennai) ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.250 పెరిగి రూ.47,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.52,250 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.51,540 గా ఉంది. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,690 కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,260 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,590 గా ఉంది. మైసూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,260 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,590 గా ఉంది. పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,280 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,570 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Today's Platinum Rate)
సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం 'ప్లాటినం' ధర నిన్నటితో (మంగళవారం) పోలిస్తే నేడు (బుధవారం) బాగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.21,930 కి దిగి వచ్చింది. విశాఖపట్నం, విజయవాడలోనూ 10 గ్రాముల ప్లాటినం రూ.200 తగ్గి, రూ.21,930 కు చేరింది.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
మన దేశంలో పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ ధరల మార్పు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఈ కారణాల్లో ఒకటి. ఇలా ప్రపంచ మార్కెట్‌లో గోల్డ్ రేటు పెరగడానికి కూడా చాలా కారకాలు పని చేస్తాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్ రష్, సిల్వర్ షైనింగ్' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే!
Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్
High Interest: ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ
EMI Fact: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!