By: ABP Desam | Updated at : 29 Jun 2022 06:57 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు నిలకడగా ఉంది. ఇక వెండి ధర నేడు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,980 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,600 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,980గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,600 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,030 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.16 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.23,000 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Year Ender 2024: ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు
Cashback Credit Cards: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్ డిస్కౌంట్ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్
Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ
Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి
CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్ లోన్ తీసుకోలేదు' - నా సిబిల్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం