search
×

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Hyderabad Gold Rate: ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,090 గా ఉంది.

FOLLOW US: 
Share:

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,090 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.21 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.23,530 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 29 May 2022 06:59 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

ఇవి కూడా చూడండి

Credit Card Closing: క్రెడిట్‌ కార్డ్‌ అప్పులు తగ్గించుకునేందుకు సింపుల్ ట్రిక్‌!

Credit Card Closing: క్రెడిట్‌ కార్డ్‌ అప్పులు తగ్గించుకునేందుకు సింపుల్ ట్రిక్‌!

KRN Heat Exchanger: కేఆర్‌ఎన్‌ హీట్ ఎక్స్ఛేంజర్ సూపర్ డూపర్ ఎంట్రీ - ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్‌

KRN Heat Exchanger: కేఆర్‌ఎన్‌ హీట్ ఎక్స్ఛేంజర్ సూపర్ డూపర్ ఎంట్రీ - ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్‌

Gold-Silver Prices Today 03 Oct: ఇజ్రాయెల్‌ దాడులతో పెరుగుతున్న పుత్తడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 Oct: ఇజ్రాయెల్‌ దాడులతో పెరుగుతున్న పుత్తడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?

PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?

Investment Tips: ఎస్‌బీఐ బంపర్‌ హిట్‌ స్కీమ్‌ - ఒక్క డిపాజిట్‌తో ప్రతి నెలా ఆదాయం

Investment Tips: ఎస్‌బీఐ బంపర్‌ హిట్‌ స్కీమ్‌ - ఒక్క డిపాజిట్‌తో ప్రతి నెలా ఆదాయం

టాప్ స్టోరీస్

Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?

Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?

Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?

Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?

Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా

Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా

Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!

Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!