By: ABP Desam | Updated at : 20 Mar 2023 02:36 PM (IST)
Edited By: Arunmali
'గోల్డెన్' రికార్డ్ - తొలిసారి ₹60 వేలు దాటిన పసిడి
Gold Price Record high: గత రికార్డులు బద్దలయ్యాయి. బంగారం మొదటిసారి 10 గ్రాములకు రూ. 60,000 మార్కును దాటింది. ఇవాళ (సోమవారం, మార్చి 20, 2023) MCXలో బంగారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయిలో రూ. 60,065 కి చేరుకుంది. మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో ఈ ఫీట్ సాధ్యమైంది. ఆ సమయానికి 10 గ్రాముల రేటు రూ. 637 లేదా 1.07% పెరిగింది.
పతనమవుతున్న స్టాక్ మార్కెట్, ఇతర కమొడిటీస్ మార్కెట్ల నుంచి భారీగా డబ్బు వెనక్కు తీసుకుంటున్న పెట్టుబడిదార్లు, ఆ మొత్తాన్ని సురక్షిత పెట్టుబడి మార్గమైన (safe haven) బంగారంలోకి మళ్లిస్తున్నారు. కొనుగోళ్లు పెరగడం వల్ల బంగారం కొత్త చారిత్రక రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది.
రూ. 60,418 స్థాయికి బంగారం
MCX లో 10 గ్రాముల బిస్కట్ బంగారం (స్వచ్ఛమైన పసిడి) ధర ఉదయం రూ. 59,418 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మొదట 60,000 దాటింది. ఆ తర్వాత రూ. 60,418 స్థాయికి చేరుకుంది. కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి. దీనిని బట్టి, ఇవాళ్టి ట్రేడ్‌లో 10 గ్రాముల పసిడి రేటు రూ. 1000 జంప్ చేసింది. బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి రూ. 69,000 దాటి ప్రస్తుతం రూ. 69,100 వద్ద ట్రేడవుతోంది.
ధరలు ఎందుకు పెరిగాయి?
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ సంక్షోభం, ఆ తర్వాత దిగ్గజ స్విస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్‌లో కూడా పతనం ప్రపంచ మార్కెట్లను భయపెట్టింది. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు భారీ స్థాయి అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. వాటిలో భారతీయ మార్కెట్ కూడా ఉంది. పెట్టుబడిదార్లు స్టాక్స్‌ను విక్రయిస్తున్నారు, అదే సమయంలో బంగారంపై పెట్టుబడులు పెంచుతున్నారు.
మంగళవారం (2023 మార్చి 21) నాడు, ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ (FOMC) సమావేశం ప్రారంభమవుతుంది. వడ్డీ రేట్ల పెంపుపై బుధవారం నాడు నిర్ణయం వెలువడుతుంది. 25 బేసిస్ పాయింట్లు లేదా పావు శాతం వడ్డీ రేటు పెంపును మార్కెట్ అంచనా వేస్తోంది. బ్యాంకింగ్ రంగ సంక్షోభం, అమెరికాలో మిశ్రమ ఆర్థిక గణాంకాల నడుమ ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై చాలా ఆసక్తి నెలకొంది. ఫెడ్ తీసుకునే నిర్ణయం బంగారానికి స్పష్టమైన డైరెక్షన్‌ను నిర్దేశిస్తుంది.
ట్రేడర్లు ఇప్పుడు ఏం చేయాలి?
IIFL సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా లెక్క ప్రకారం... ఎల్లో మెటల్ వచ్చే నెలలో రూ. 62,000 మార్కును తాకవచ్చు. అతని వ్యూహం ప్రకారం ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్‌ను దాదాపు రూ. 60,000 స్థాయిలో డిప్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
అంతర్జాతీయ ధరలు $2,050 - $2,080 స్థాయలను పరీక్షించవచ్చని గుప్తా చెబుతున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Latest Gold-Silver Price Today 09 June 2023: షాక్ ఇచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Income Tax: ఎలాంటి బహుమతులపై ఇన్‌కం టాక్స్ కట్టక్కర్లేదు?
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్బీఐ ఇచ్చిన వరమా ఇది?
Repo Rate: రెపో రేట్ మారలేదు, ఇప్పుడు బ్యాంక్ EMIల పరిస్థితేంటి?
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Telangana politics : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?
Takkar Movie Review - 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?