By: Arun Kumar Veera | Updated at : 21 May 2024 09:40 AM (IST)
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా?, వివిధ బ్యాంక్‌ల్లో కొత్త వడ్డీ రేట్లు ఇవి
Latest Gold Loan Interest Rates: బ్యాంక్ లోన్లలో గోల్డ్ లోన్ల రూటే సెపరేటు. 'బంగారంపై రుణం' చాలా సులభంగా & అతి తక్కువ సమయంలో దొరుకుతుంది. పర్సనల్ లోన్, హోమ్ లోన్ తరహాలో.. ఈ లోన్ తీసుకోవడానికి గొప్ప క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు, ఎలాంటి ఆదాయ రుజువు పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను సమర్పించాల్సిన పని లేదు. కస్టమర్, బ్యాంక్‌లో కుదువబెట్టే బంగారమే అతనికి గ్యారెంటర్‌గా పని చేస్తుంది.
తక్షణం డబ్బు అవసరమైన సందర్భంలో గోల్డ్ లోన్ అండగా నిలబడుతుంది. బంగారంతో బ్యాంక్‌కు వెళ్తే ఒక గంటలోనే (బ్యాంక్‌లో రద్దీ తక్కువగా ఉంటే) డబ్బుతో తిరిగి రావచ్చు. పైగా, వడ్డీ వ్యాపారులు వసూలు చేసే మొత్తం కంటే తక్కువ వడ్డీ రేటుకే రుణం దొరుకుతుంది. ఫలితంగా లోన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అంతేకాదు, బంగారు ఆభరణాలు లేదా నగలను భద్రత కోసం కూడా బ్యాంక్‌లో తాకట్టు పెట్టేవాళ్లు కూడా ఉంటారు.
సాధారణంగా, బ్యాంక్‌లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.25% నుంచి 18% మధ్యలో (Latest Gold Loan Rates) మారుతూ ఉంటాయి. బంగారంపై తీసుకునే రుణాలను 3 నెలల నుంచి 36 నెలల మధ్యకాలంలో తిరిగి తీర్చవచ్చు, బ్యాంక్‌ను బట్టి ఈ కాలవ్యవధి మారుతుంది.
గోల్డ్ లోన్‌పై వివిధ బ్యాంక్‌ల్లో కొత్త వడ్డీ రేట్లు:
స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్ రేట్లు (SBI gold loan interest rates)
EMI రూపంలో తీర్చేలా గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు -------- 9.90%
12 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ రేటు -------- 9.15%
3 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ రేటు -------- 8.75%
6 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ రేటు -------- 8.90%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ లోన్ రేట్లు (PNB gold loan interest rates)
బంగారు నగలు కుదువబెట్టి లోన్ తీసుకుంటే వడ్డీ రేటు -------- 9.25%
సావరిన్ గోల్డ్ బాండ్లు కుదువబెట్టి లోన్ తీసుకుంటే వడ్డీ రేటు -------- 9.25%
బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ రేట్లు (Bank of Baroda gold loan interest rates)
రిటైల్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు -------- 9.15%
డిమాండ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు -------- 9.40%
EMI ఆధారంగా తీసుకుంటే వడ్డీ రేటు -------- 9.40%
ఓవర్‌డ్రాఫ్ట్ ఆధారంగా తీసుకుంటే వడ్డీ రేటు -------- 9.40%
హెచ్‌డీఎఫ్ బ్యాంక్ గోల్డ్ లోన్ రేట్లు (HDFC Bank gold loan interest rates)
గోల్డ్ లోన్ మీద, ఈ బ్యాంక్ కనీసం 9.00%, గరిష్టంగా 17.65% వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. సగటున 11.98% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డ్ లోన్ రేట్లు (ICICI Bank gold loan interest rates)
గోల్డ్ లోన్ మీద, ఐసీఐసీఐ బ్యాంక్ కనిష్టంగా 9.00%, గరిష్టంగా 18.00% వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. సగటున 14.65% వడ్డీ తీసుకుంటోంది.
యాక్సిస్ బ్యాంక్ గోల్డ్ లోన్ రేట్లు (Axis Bank gold loan interest rates)
బంగారు రుణాలపై, యాక్సిస్ బ్యాంక్ కనిష్టంగా 9.30%, గరిష్టంగా 17.00% వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
PF Money Withdrawl: పీఎఫ్ విత్‌డ్రా ఇప్పుడు ఇంకా ఈజీ, ఆ కీలక రూల్ రద్దు
Aadhaar Linking: ఆధార్‌తో ముడిపెట్టాల్సిన మూడు కీలక విషయాలు - ఇబ్బందులు మీ దరి చేరవు
Top 10 Govt Schemes: ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన టాప్-10 ప్రభుత్వ పథకాలు - అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు!
Gold-Silver Prices Today 05 April: గోల్డెన్ న్యూస్, పసిడి మరో 10,000 పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Plot Buying Tips: ప్లాట్ కొంటే లాభం ఉండాలిగానీ లాస్ రాకూడదు, ఈ విషయాలు చెక్ చేయండి
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
Shock : ఎవర్ని పట్టుకున్న షాక్ కొడుతోందా ?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే