By: Rama Krishna Paladi | Updated at : 16 Aug 2023 03:37 PM (IST)
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ( Image Source : Pexels )
Financial Management:
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేది డబ్బులు సంపాదించేందుకే కదా! ఖర్చులకు పోను అందులో కొంత దాచుకొని, పెట్టుబడి పెడితేనే సంపద సృష్టించేందుకు వీలవుతుంది. ఇన్సూరెన్స్ మాదిరిగానే ఇన్వెస్టింగ్‌నూ చిన్న వయసులోనే ఆరంభిస్తే మంచిది. ఒకవేళ మీ వయసు 30-40 ఏళ్ల మధ్య ఉందా? మరి 60 ఏళ్లు వచ్చేసరికి రూ.10 కోట్ల సంపద సృష్టించాలంటే ఏం చేయాలి? ఎలాంటి మార్గాలు అవలంబించాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ పెట్టాలి?
లక్ష్యం ఏంటి?
ఆర్థిక స్వాంతంత్ర్యం (Financial Freedom) అనేది వ్యక్తిత్వాన్ని బట్టి మారుతుంది. కొందరికి కోటి రూపాయలు ఉంటే చాలు! ఇంకొందరికి పది కోట్లు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మరికొందరు ఇంకా ఎక్కువే అవసరమని భావిస్తారు. అందుకే మీరు ఎంచుకొనే లక్ష్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టాల్సిన తీరు మారుతుంది. ఉదాహరణకు మీ వయసు 30 ఏళ్లు అనుకుంటే పెట్టుబడి పెట్టడానికి ఇంకా 30 ఏళ్ల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు 40 ఏళ్లకు వచ్చేసుంటే మిగిలింది 20 ఏళ్లు మాత్రమే.
అసెట్ క్లాస్ కీలకం
మీరు ఎంచుకొన్న అసెట్ క్లాస్‌ను (Asset Class) బట్టి మీరు అంచనా వేస్తున్న ఆదాయం వస్తుంది. ఈక్విటీతో (Equity Funds)) పోలిస్తే డెట్ ఫండ్స్‌లో (Debt Funds) ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. సుదీర్ఘ కాలం మదుపు చేస్తారు కాబట్టి ఈక్విటీని ఎంచుకొంటే ఇన్‌ఫ్లేషన్‌ను బీట్ చేయడమే కాకుండా ఎక్కువ సంపాదించేందుకు ఆస్కారం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మీ వయసు, మీ పెట్టుబడి తీరును బట్టి 60 ఏళ్లకు రూ.10 కోట్లు సంపాదించాలంటే నెలకు రూ.30,000 నుంచి రూ.1.7 లక్షల వరకు మదుపు చేయాల్సి ఉంటుంది.
వయసు 30: మిగిలిన 30 ఏళ్లలో రూ.10 కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి?
మీరు సంప్రదాయ శైలిలో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. అంటే ఎక్కువగా డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. 30 ఏళ్లకు సరాసరి 8 శాతం రాబడి వస్తుందని అంచనా వేసుకుంటే ప్రతి నెల రూ.68,000- 69,000 వరకు పెట్టుబడి పెట్టాలి. బ్యాలెన్స్‌డ్ ఇన్వెస్టర్ అయితే ఈక్విటీ, డెట్‌ల సమపాళ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు సగటున 10 శాతం రిటర్న్ వస్తుందనుకుంటే నెలకు రూ.46,000-47,000 పెట్టుబడి పెడితే చాలు. ఒకవేళ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే మొదట్లో ఎక్కువగా ఈక్విటీలోనే మదుపు చేస్తారు. 30 ఏళ్లకు సగటున 12 శాతం రాబడి వస్తుందనుకుంటే నెలకు రూ.30,000-31,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
వయసు 35: మిగిలిన 35 ఏళ్లలో రూ.10 కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి?
మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే 8 శాతం అంచనా వేసుకుంటే మిగిలిన 25 ఏళ్ల పాటు ప్రతి నెలా లక్షల నుంచి లక్షా పదివేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. బ్యాలెన్స్‌డ్ ఇన్వెస్టర్ 10 శాతం సగటు రాబడి అంచనాతో నెలకు రూ.77,000-78,000 పెట్టుబడి పెట్టాలి. అదే అగ్రెసిస్ ఇన్వెస్టర్ అయితే 12 శాతం రాబడి అంచనాతో మిగిలిన 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.55,000-56,000 ఇన్వెస్ట్ చేయాలి.
వయసు 40: మిగిలిన 20 ఏళ్లలో రూ.10 కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి?
మధ్య వయసు దాదాపుగా దాటేస్తున్నారు కాబట్టి అన్ని రకాల ఇన్వెస్టింగ్ శైలిలోనూ ఎక్కువ డబ్బే మదుపు చేయాల్సి ఉంటుంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ 8 శాతం రాబడి అంచనా 20 ఏళ్ల పాటు ప్రతి నెల రూ.1.6 లక్షల నుంచి 1.7 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఇక బ్యాలెన్స్‌డ్ ఇన్వెస్టర్ 10 శాతం రాబడి అంచనాతో ప్రతి నెలా రూ.1.3 లక్షల నుంచి 1.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. అగ్రెసివ్ ఇన్వెస్టర్ నెలకు రూ. లక్ష నుంచి లక్షా పదివేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, వివిధ పన్నులు కలుపుకుంటే మరికాస్త ఎక్కువే ఇన్వెస్ట్ చేయాలని నిపుణుల సలహా.
పెంచుతూ వెళ్లండి!
చిన్న వయసులో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ పెట్టుబడి అవసరం అవుతుందన్నది నిజమే! అయితే ఎక్కువ రిటర్న్ వస్తున్నప్పుడు ఏ వయసులో అయినా తక్కువ పెట్టుబడే అవసరం అవుతుంది. ఇక ఏటా మీ జీతం పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మీ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడు మరింత వెల్త్ జనరేట్ చేయొచ్చు. టాప్ అప్ ఇన్వెస్ట్‌మెంట్, సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మరో ఆప్షన్.
ఇండెక్స్ ఫండ్లు బెస్ట్
ఈక్విటీల్లో సుదీర్ఘ కాలం మదుపు చేయడం వల్ల ఒడుదొడుకులు తక్కువగా ఎదురవుతాయి. స్థిరమైన రాబడి వస్తుంది. 20 ఏళ్లంటే తక్కువ కాలమేమీ కాదు. కాబట్టి ఇండెక్స్ ఫండ్లు, హైబ్రీడ్ ఫండ్లు, మల్టీక్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ కొద్ది కొద్దిగా ఈక్విటీలో పెట్టుబడి తగ్గించి డెట్ వైపు మళ్లాలి. అయితే ఇండెక్స్‌లు సీఏజీఆర్ ప్రకారం 12-16 శాతం వరకు రిటర్న్ ఇస్తాయి.
Also Read: తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివైన మార్గం ఇది!
Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Lost Pan Card: పోయిన పాన్ కార్డ్ కోసం మళ్లీ అప్లై చేయడం చాలా ఈజీ, ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి
Small Savings Rate Hike: ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం
Gold-Silver Price 30 September 2023: మరింత దిగొచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్, షాక్ ఇచ్చిన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>