By: ABP Desam | Updated at : 12 Nov 2022 08:01 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ప్రత్యేక స్పెషల్ వడ్డీ పథకం
PNB Special FD Offer: ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇన్వెస్టర్లు 7.85 శాతం వార్షిక వడ్డీ పొందొచ్చు. గరిష్ఠం రూ.2 కోట్ల వరకు ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నాన్ కాలబుల్ 600 రోజుల డిపాజిట్ పథకం కింద కేవలం సీనియర్ సిటిజన్లు (60+ ఏళ్లు), సూపర్ సీనియర్ సిటిజన్స్ (80+ ఏళ్లు) మాత్రమే ప్రత్యేక గరిష్ఠ వడ్డీను పొందొచ్చు.
సాధారణ ప్రజల కోసం 600 రోజులు కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా 7 శాతం వరకు వడ్డీని అందుకోవచ్చు. ఇక 60 ఏళ్ల పైబడిన వారికి ఇదే పథకం కింద 7.50 శాతం వరకు వడ్డీని చెల్లిస్తారు. సూపర్ సీనియర్ సిటిజన్లకు 600 రోజులు కాబుల్ ఎఫ్‌డీ కింద 7.80 వడ్డీని ఇస్తారు. నాన్ కాలబుల్ 600 రోజుల ఎఫ్‌డీలో సాధారణ ప్రజానీకం 7 శాతం, సీనియర్ సిటిజన్లు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం మేర వడ్డీ ఇస్తారు. నాన్ కాలబుల్ ఎఫ్‌డీలో ప్రీ మెచ్యూర్ విత్‌డ్రావల్ అవకాశం ఉండదు.
'మా విలువైన వినియోగదారులకు అత్యుత్తమ పథకాలు అందించడమే మా లక్ష్యం. అందుకే వారికి అత్యధిక వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కస్టమర్లు వారి పొదుపై గరిష్ఠ వడ్డీని పొందుతారు. పీఎన్‌బీ వన్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానూ ఈ పథకంలో చేరొచ్చు' అని పీఎన్‌బీ ఎండీ, సీఈవో అతుల్ కుమార్ గోయెల్ అన్నారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లను మెచ్యూరిటీ తీరకముందే విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఉంటే దానిని కాలబుల్ ఎఫ్‌డీ అంటారు. సాధారణంగా గడువు తీరకముందే విత్‌డ్రా చేస్తే పెనాల్టీ రుసుములు విధిస్తారని తెలిసిందే. ఇలాంటి డిపాజిట్లకు లాకిన్ పీరియడ్ ఉండదు. నాన్ కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్టర్లు ముందుగా విత్‌డ్రా చేసుకొనే సౌకర్యం ఉండదు. లాకిన్ పిరియడ్ ఉంటుంది. అందుకే వీటిని దృష్టిలో ఉంచుకొని డిపాజిట్ చేయడం మంచిది. ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతుండటంతో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలను పెంచుతున్నారు. మున్ముందు ఇవి మరింత పెంచుతారని సమాచారం.
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Credit Card Tips: క్రెడిట్ కార్డ్ మోసంలో డబ్బు పోగొట్టుకున్నారా? భయపడకుండా వెంటనే ఈ పని చేయండి;
New Labor Codes Benefits: కొత్త లేబర్ కోడ్ కార్మికుల పరిస్థితులను ఎలా మెరుగుపరుస్తుంది! ఉద్యోగుల జీవితాలను మార్చే 3 చట్టాల గురించి తెలుసుకోండి!
Post Office Schemes : పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ చేయడానికి ఈ 3 పథకాలు బెస్ట్.. FD కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు
Income Tax Refund: మీ ఆదాయపు పన్ను రీఫండ్ రాలేదా? డబ్బులు ఎప్పటిలోగా వస్తాయి? స్టేటస్ చెక్ చేయండి
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?