By: ABP Desam | Updated at : 21 Jun 2022 07:26 PM (IST)
డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయా ? అయితే ఈ "టోకెన్" గురించి తెలుసుకోవాల్సిందే!
All About Tokenisation : జూలై ఒకటో తేదీ నుంచి టోకనైజేషన్ అమల్లోకి వస్తోంది. ఈ టోకనైజేషన్ అనే మాట తరచుగా వినబడుతోంది. ఇదేమిటో చాలా మందికి తెలియదు. ఈ టోకనైజేషన్‌కు సంబంధించినపూర్తి వివరాలు ఇవి.
క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వారికి కీలకం !
డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే ‘టోకనైజేషన్’. ఆన్‌లైన్ షాపింగ్.. ఫుడ్ ఆర్డర్లు చేసుకోవాలంటే కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తాం. కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపే ప్రతీసారి 16-అంకెల కార్డు వివరాలు, కార్డు గడువు తేదీని ఎంటర్ చేయాలి. అలా చేయకుండా ఉండటానికి.. ఒక సారి ఎంటర్ చేస్తే అదే రికార్డుల్లో ఉండేలా చేసేదే టోకనైజేషన్.
ఇప్పుడు కూడా ఉంది.. కానీ ఈ టోకెన్ సురక్షితం !
నిజానికి ఇప్పుడు కూడా కార్డును సేవ్ చేసే ఆప్షన్ ఉంది. కానీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఒకేసారి సమీకరించి, హ్యాకర్లకు చిక్కకుండా భద్రపరిచే కీవర్డ్‌నే ‘టోకెన్’ అంటారు. కస్టమర్ వ్యక్తిగత సమాచారం, కార్డు వివరాలను రెండోసారి అడగకుండా అత్యంత సెక్యూరిటీతో లావాదేవీలను నిర్వహించే ప్రక్రియనే ‘టోకనైజేషన్’గా పిలుస్తున్నారు. ఈ కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్ కోసం ప్రతీసారి సీవీవీ నంబర్ అవసరం లేదు.
సురక్షితమైన చెల్లింపుల కోసమే !
‘టోకనైజేషన్’ ద్వారా ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చు. కొనుగోళ్లు జరిపే ప్రతీసారి కార్డు 16 అంకెలను నమోదు చేయడం, సీవీవీని ఎంటర్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు, సైట్‌లోని థర్డ్ పార్టీ.. కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరించే ప్రమాదం ఉంది. దీనికి ‘టోకనైజేషన్’తో దీనికి చెక్ పెట్టొచ్చు. హ్యాకర్లు టోకెన్ నుంచి కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం సాధ్యం కాదు. ఆ మేరకు సెక్యూరిటీ ఏర్పాట్లు ఉంటాయి.
టోకనైజేషన్ ఎలా చేసుకోవాలంటే ?
కొనుగోళ్లు జరిపే సైట్‌లో పేమెంట్ జరిపేటప్పుడు (చెక్-అవుట్ పేజీలో) కస్టమర్ తొలుత కార్డు వివరాలు నమోదు చేయాలి. సూచించిన టోకనైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. టోకెన్‌ను ఎంపిక చేసుకొన్న తర్వాత కార్డు వివరాలన్నీ అందులో నిక్షిప్తమవుతాయి. సీవీవీ లేదా ఓటీపీతో మీ లావాదేవీలను అప్రూవ్ చేసుకోవచ్చు. మళ్లీ కొనుగోళ్లు జరుపాలనుకొంటే.. కార్డు వివరాలను నమోదు చేయడానికి బదులు ప్రాక్సీ మాదిరిగా ఉన్న ఎన్‌క్రిప్టెడ్ టోకెన్‌ను ఎంచుకోవాలి. ఓటీపీ ద్వారా లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఒక్క కార్డుకు ఒక్క టోకెన్‌ను జారీ చేస్తారు. టోకనైజేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దేశీయ కార్డులను మాత్రమే టోకనైజేషన్‌కు తొలుత అనుమతించనున్నారు. జూలై ఒకటి నుంచి ఈ టోకనైజేషన్ అమల్లోకి వస్తుంది.
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్