దేశం ఆర్థికంగా వృద్ధి చెందడానికి వనరులతో పాటు పన్నులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ దేశంలోనే మౌలిక వసతుల కల్పనకు పన్నులు కీలకం. కానీ ఈ దేశంలో నామమాత్రపు పన్ను కడితేచాలు. ఇప్పుడు క్రిప్టోకుబేరుల కన్ను ఆ దేశంపై పడింది. తక్కువ పన్నులు అనడంతో ఆ దేశానికి క్యూకట్టారు. అదే కరేబియన్ ద్వీపం ప్యూర్టో రికా. మూడున్నర వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో 32 లక్షల జనాభా నివసించే ప్యూర్టో రికా అడ్మినిస్టేషన్, నగదు వ్యవహారాలన్నీ అమెరికా చూసుకుంటుంది. ఈ దీవిలో సెయింట్ రెగిస్ బహియా బీచ్ అనే రిసార్ట్ ఉంది. 483 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ బంపర్ ఆఫర్ పెట్టింది. ఐకిగాయ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆంటోనీ ఎమ్ట్‌మ్యాన్‌ ఈ ఏడాది దీవిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు క్రిప్టోకుబేరులు ప్యూర్టో రికాకు క్యూ కట్టడానికి ఇతనే కారణం. అమెరికా కుబేరులు ముఖ్యంగా డిజిటల్‌ కరెన్సీతో సంబంధం ఉన్నవాళ్లంతా ఈ దీవికి వెళ్తున్నారు. 


అమెరికాలో అధిక ట్యాక్సులు


క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేసేవాళ్లు ప్యూర్టో రికాకు క్యూ కట్టడానికి కారణం ఇక్కడ పన్ను మినహాయింపులు. ఇక్కడకు కొత్తకు వచ్చే వాళ్లు నామమాత్రపు పన్ను చెల్లిస్తే చాలు. క్రిప్టో కరెన్సీకి ఈ మినహాయింపు ఎక్కువగానే ఉంది. ఇక్కడకు అమెరికన్లు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ దేశంలోని కఠిన టాక్స్ చట్టాలే కారణమంటున్నారు. అమెరికా ఫెడరల్‌ చట్టాల ప్రకారం ఇన్వెస్టర్లు 37 శాతం తక్కువ రాబడి వచ్చినా 20 శాతం వరకు పన్నులు చెల్లించాలి. ధనవంతులపై ఈ పన్నులు మరింత ఎక్కువగా ఉంటాయి. దీంతో తక్కువ టాక్స్ ఉన్న దేశాలకు అమెరికా కుబేరులు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. 


Also Read: వారెంటు లేకుండా జైలుకు! క్రిప్టో రూల్స్‌ ఉల్లంఘిస్తే విధించే శిక్షలివే


కొత్త వచ్చిన వాళ్లకు ట్యాక్సుల్లో మినహాయింపు


ప్యూర్టో రికా చట్టాలు విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ శాశ్వతంగా నివసించేవారు ఫెడరల్‌ పన్నులు కట్టాలి. కానీ అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే బోనా ఫైడ్‌ రెసిడెన్స్‌ నామమాత్రపు ట్యాక్సులు చెల్లిస్తే చాలు. ఫెడరల్ ట్యాక్సుల్లో 4 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ప్యూర్టో రికా పన్ను చట్టాలు స్థానికుల కంటే పొరుగు వాళ్లకే ఎక్కువ లాభం చేకూరుస్తాయి. ఈ కారణంగా కుబేరులు ఈ వైపు వాలిపోతున్నారు. దీంతో స్థానికులు ప్యూర్టో రికాను యూఎస్‌ఏలో 51వ రాష్ట్రంగా గుర్తించాలని కోరుతున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2012లో ప్యూర్టో రికా ప్రభుత్వం పన్నుల చట్టాన్ని సవరించింది. ఈ కారణంతో కొత్త వారికి మినహాయింపులు లభించాయి. 2017లో క్రిప్టో కరెన్సీ ప్రారంభంలో చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేశారు. మళ్లీ ఈ ఏడాది క్రిప్టో బూమ్‌ పెరగడంతో ఇన్వెస్టర్ల చూపులు ఈ దీవిపై పడ్డాయి. క్యాపిటల్‌ గెయిన్‌  కోసం ప్యూర్టో రికాకు క్యూకట్టారు. 


Also Read:  అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి