టెగా ఇండస్ట్రీస్‌ ఐపీవో సూపర్‌ హిట్టైంది! సోమవారం స్టాక్‌ మార్కెట్లలో 68 శాతం ప్రీమియంతో ఈ కంపెనీ షేర్లు నమోదయ్యాయి. మొదటి రోజే ఇన్వెస్టర్లకు చక్కని లాభాలను పంచిపెట్టింది. రూ.726 వద్ద ముగిసింది.


మైనింగ్‌ పరిశ్రమలో పరికరాలను ఎగుమతి చేసే టెగా ఇష్యూ ధర రూ.453తో మార్కెట్లోకి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో 68 శాతం ప్రీమియంతో రూ.760, బీఎస్‌ఈలో 66 శాతం ప్రీమియంతో రూ.753 వద్ద నమోదైంది. మొత్తంగా 60 శాతం ప్రీమియమైన రూ.726 వద్ద ముగిసింది. రూ.619  కోట్లతో టెగా ఐపీవోకు రాగా 219 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,991 కోట్లకు చేరుకుంది.


టెగా ఒక్కో లాట్‌కు 33 షేర్లను కేటాయించింది. అంటే లాట్‌ కొనుగోలు విలువ రూ.14,949. అంటే కేటాయింపు దక్కిన వారికి లిస్టింగ్ ధర రూ.753తో పోలిస్తే రూ.24,849కి పెరిగింది. ఒక లాట్‌కు రూ.9,900 లాభం వచ్చింది. ఇక ముగింపు ధర రూ.726తో చూసుకుంటే రూ.9,009 లాభం వచ్చింది.


కంపెనీ లిస్ట్‌ అవ్వగానే ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగం విక్రయించారు! ఇష్యూకు ముందు వారికి 85.17 శాతం వాటా ఉండగా లిస్టైన తర్వాత 79.17కు తగ్గింది. పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 14.83 శాతం నుంచి 20.83 శాతానికి పెరిగింది. టెగా ఇండస్ట్రీస్‌ 2018-19 నుంచి 2020-21 వరకు 12.7 శాతం సీఏజీఆర్‌తో ఆదాయం పెంచుకుంది. ఇదే సమయంలో నికర లాభం 104 శాతం పెరిగింది.


Also Read: PM Modi on Bank Deposit: నష్టాల్లోని బ్యాంకుల్లో డిపాజిటర్ల కష్టాలు చూడలేకే రూ.5 లక్షల బీమా తెచ్చాం: మోదీ


Also Read: Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!


Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్‌ ధరల పెంపు?


Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా ఉన్న వెండి, నేటి తాజా ధరలు


Also Read: Petrol-Diesel Price, 13 December: పెరుగుతున్న ముడి చమురు ధరలు.. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి