By: ABP Desam | Updated at : 04 Oct 2023 03:03 PM (IST)
సిబిల్ స్కోర్‌లో మీరు 'పూర్' అయినా క్రెడిట్ కార్డ్ కచ్చితంగా వస్తుంది
Credit Card: సాధారణంగా, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లకు మాత్రమే ఏ బ్యాంకు అయినా క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. మంచి స్కోర్ లేని వ్యక్తులకు క్రెడిట్ కార్డ్ దొరకడం దాదాపు కష్టం. అయితే, బ్యాడ్/పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా, కచ్చితంగా క్రెడిట్ కార్డ్ పొందే సింపుల్ చిట్కా ఒకటి ఉంది. దీనిని ఫాలో అయితే, బ్యాంక్‌లు మరోమాట మాట్లాడకుండా మీ కోసం కార్డ్ జారీ చేస్తాయి.
క్రెడిట్ స్కోర్ అంటే?
క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ చరిత్రను చెబుతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలు, 'బయ్ నౌ పే లేటర్' వంటివాటిని తిరిగి సరిగా చెల్లిస్తున్నామో లేదో చెప్పే మూడు అంకెల నంబరే క్రెడిట్ స్కోర్. ఇది 300-900 మధ్య ఉంటుంది. మీ పాన్ ఆధారంగా మీ క్రెడిట్ హిస్టరీని క్రెడిట్ కంపెనీలు ట్రాక్ చేస్తాయి. తీసుకున్న రుణాల మీద చేసే రీపేమెంట్స్ ఆధారంగా 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్ స్కోర్‌గా మీకు కేటాయిస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోర్.
క్రెడిట్ స్కోర్ అంకెల అర్ధం
800 నుంచి 900 : ఎక్స్‌లెంట్/అద్భుతం
740 నుంచి 799: వెరీ గుడ్/చాలా బాగుంది
670 నుంచి 739: గుడ్/బాగుంది
580 నుంచి 669: ఫెయిర్/పర్లేదు
300 నుంచి 579: పూర్/అసలు బాగోలేదు
పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు కూడా క్రెడిట్ కార్డును పొందాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ద్వారా సాధ్యమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), SBM బ్యాంక్ (ఇండియా) సహా మరికొన్ని బ్యాంక్‌లు తమ FD ఖాతాదార్లకు క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ పరిమితి FDలో 80- 90% వరకు ఉంటుంది. కార్డ్ హోల్డర్ నెలవారీ ఔట్ స్టాండింగ్ చెల్లించకపోతే, ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి ఆ మొత్తాన్ని బ్యాంక్ తీసుకుంటుంది. FDలపై ఇచ్చే క్రెడిట్ కార్డ్‌లపై టాక్స్‌లు, ఛార్జీలు ఇతర కార్డ్‌ల కంటే తక్కువగా ఉంటాయి.
ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతి (SBI Card Unnati)
ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతిపై నాలుగేళ్ల వరకు ఎలాంటి ఛార్జీ ఉండదు, ఫ్రీగా వాడుకోవచ్చు. ఐదో సంవత్సరం నుంచి ప్రతి ఏటా రూ. 499 చెల్లించాలి. రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ FD ఉంటే ఈ కార్డ్‌ను బ్యాంక్ జారీ చేస్తుంది.
ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ (ICICI Instant Platinum Credit Card)
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ వస్తుంది. చాలా త్వరగా, ఉచిత క్రెడిట్ కార్డ్ పొందడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో జాయినింగ్ లేదా యాన్యువల్ ఫీజ్ ఉండదు.
యాక్సిస్ బ్యాంక్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ (Axis Bank Insta Easy Credit Card)
FD మొత్తంలో 80% వరకు ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ పరిమితిగా జారీ చేస్తారు. ఔట్‌స్టాండింగ్ లేకపోతే 50 రోజుల పాటు ఉచిత క్రెడిట్ అందుబాటులో ఉంటుంది.
BOB అష్యూర్ క్రెడిట్ కార్డ్ (Bank of Baroda Assure credit card)
దీనిలో, అత్యవసర సమయంలో క్రెడిట్ పరిమితిలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: స్వీప్-ఇన్ గురించి తెలుసా?, సేవింగ్స్ అకౌంట్ మీద FD వడ్డీ తీసుకోవచ్చు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు