TDS Alert SMS From Income Tax Deportment: ఆదాయ పన్ను విభాగం పంపుతున్న ఎస్‌ఎంఎస్‌లు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. తమ మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన SMS చూసి కొంతమంది గందరగోళానికి గురవుతుండగా, మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఆదాయ పన్ను విభాగం అలాంటి ఎస్‌ఎంఎస్‌ ఎందుకు పంపిందో ప్రజలకు అర్థం కాలేదు. ఏదైనా చర్య తీసుకునే ముందు ఇది ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చిన హెచ్చరికా? అని మాట్లాడుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో సైతం దీనిపై చర్చ జరుగుతోంది. నిజానికి, పని చేసినందుకు జీతం లేదా రెమ్యునరేషన్‌ తీసుకునే వ్యక్తులకు ఆదాయ పన్ను విభాగం SMSలు పంపింది. 2024 డిసెంబర్ వరకు మీ ఆదాయంలో ఇంత TDS (Tax Deducted at Source) అని అందులో వెల్లడించింది. అదేవిధంగా, 2024-25 సంవత్సరంలో మొత్తం ఆదాయంపై వర్తించే TDS వివరాలు కూడా ఆ SMSలో ఉన్నాయి.


పన్ను చెల్లింపుదారులకు అప్‌డేట్‌ ఇవ్వడమే లక్ష్యం
TDS సమాచారంతో సందేశాలను పంపడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు అప్‌డేట్‌ ఇవ్వడం మాత్రమే ఆదాయ పన్ను విభాగం ఉద్దేశం. "మీ TDS గురించి మీ కంపెనీ యాజమాన్యం ఈ సమాచారాన్ని మాతో పంచుకుంది" అని పన్ను చెల్లింపుదారులకు ‍‌(Taxpayers) తెలియజేయాలని మాత్రమే ఐటీ డిపార్ట్‌మెంట్‌ కోరుకుంది. TDS వివరాలను SMS ద్వారా పంపడం వల్ల, ఆ సమాచారంలో ఏవైనా దిద్దుబాట్లు ఉంటే మీరు పూర్తి చేయొచ్చు. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ‍‌(Income Tax Act Rules) ప్రకారం, కంపెనీ యజమాన్యాలు ప్రతి సంవత్సరం జూన్ 15న లేదా అంతకుముంే ఫామ్ 16 (Form 16)ను జారీ చేయాలి. ఫామ్‌ 16 అనేది కంపెనీ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు జారీ చేసే సర్టిఫికేట్. ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి (ITR Filing 2025) అవసరమైన సమాచారం ఆ డాక్యుమెంట్‌లో ఉంటుంది. ఫారం 16లో యజమాని - ఉద్యోగి మధ్య జరిగిన వివిధ లావాదేవీలు, TDS & TCS (Tax Collected at Source) వివరాలు ఉంటాయి.                    


మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ దగ్గర కుప్పలుతెప్పలుగా 'అన్‌క్లెయిమ్డ్‌ మనీ' - మీ డబ్బు కూడా ఉందేమో చెక్‌ చేయండి 


పన్ను బకాయిలను వెల్లడించడం ఉద్దేశ్యం కాదు 
ఆదాయ పన్ను విభాగం పంపిన SMS గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పన్ను బకాయి ఉన్నారని గానీ, పన్ను ఎగవేతకు పాల్పడ్డారని గానీ అందులో ఎలాంటి హెచ్చరిక ఉండదు. అది, మీకు అప్‌డేట్‌ ఇవ్వడానికి పంపిన సందేశం మాత్రమే. ఈ SMS అలర్ట్‌ను సర్వీస్‌ 2016లో ప్రారంభమైంది, దీని లక్ష్యం పన్ను చెల్లింపుదారులకు వారి మొత్తం TDS కటింగ్స్‌ గురించి సమాచారం ఇవ్వడం. టాక్స్‌ పేయర్లు, తమ ఆఫీస్‌ పే స్లిప్‌లను ఈ SMSలో ఇచ్చిన వివరాలతో సరిపోల్చుకోవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!