DA For Employees :  కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.  ప్రభుత్వం తన ఉద్యోగులకు COVID-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల వేతన భత్యం (DA/DR)ను చెల్లించేందుకు తిరస్కరించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభ, రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించింది.


వేతన భత్యం ఎందుకు నిలిపివేశారంటే..?
లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదోరియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానమిస్తూ.. ఆ 18 నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమేనని పేర్కొన్నారు. కరోనా సమయంలో సంక్షోభాన్ని ఎదుర్కొనడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కోసం వేతన భత్యం (DA/DR) నిలిపివేశామని ఆయన వివరించారు. ఇక ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.


ప్రస్తుత డీఏ రేట్లు, భవిష్యత్ పెరుగుదల
ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53శాతం డియర్‌నెస్ అలౌయెన్స్ (DA), కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 53శాతం డియర్‌నెస్ రిలీఫ్ (DR) వర్తిస్తుంది. ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు ఉండే అవకాశం ఉండడంతో రాబోయే నెలల్లో మరింత పెరుగుతుందని అంచనా.


8వ వేతన సంఘానికి కేంద్రం అనుమతి
ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. ఈ వేతన సంఘాన్ని 2025 చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీని వల్ల 7వ వేతన సంఘం గడువు ముగిసే 2026కి ముందే ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని అప్ డేట్ చేయనున్నారు.


Also Read : Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!


7వ వేతన సంఘం
7వ వేతన సంఘాన్ని 2014లో ఏర్పాటు చేశారు. దీని సిఫారసులు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరాల్లో వేతన భత్యాల్లో రివ్యూలు జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also Read : Unclaimed Amount: ఎల్‌ఐసీ దగ్గర కుప్పలుతెప్పలుగా 'అన్‌క్లెయిమ్డ్‌ మనీ' - మీ డబ్బు కూడా ఉందేమో చెక్‌ చేయండి