CM PK: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసిన ఆహా - జనసేనాని మీద అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో...
Aha OTT New Movies: ఆహా ఓటీటీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. 'సీఎం పీకే'. అంతకు మించి ఏమీ చెప్పలేదు. జనసేన పార్టీ, జనసేనాని గురించి ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? అని చర్చ మొదలైంది.
PSPK అంటే ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ తెలుగు ప్రేక్షకులలో మాత్రమే కాదు... ఇండియా అంతటా ఈ పేరు పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక సెన్సేషన్. హీరోగా తన మార్క్ చూపించి, ఇప్పుడు రాజకీయాలలో చూపిస్తూ... దూసుకు వెళుతున్నారు.
జనసేన పార్టీ స్థాపించి, గడచిన ఏపీ ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ సాధించి చరిత్ర సృష్టించారు. జనసేనానిని ముఖ్యమంత్రిగా చూడాలనేది అభిమానుల కోరిక. అది ఎప్పుడు తీరుతుంది అనేది ఎప్పుడు చెప్పడం కష్టం. అయితే ఆయనను సీఎం చేసింది ఆహా ఓటీటీ.
ఆహా ఓటీటీలో సీఎం పీకే!
CM PK on Aha OTT: ఆహా ఓటీటీ సంస్థ ఆదివారం ఒక టైటిల్ అనౌన్స్ చేసింది. అది 'సీఎం పీకే'. అంతకు మించి మరొక ముక్క చెప్పలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు చెబుతామని మాత్రమే పేర్కొంది. ఆహా ఓటీటీలో 'సీఎం పీకే' వస్తుందని చెప్పింది తప్ప... అది సినిమానా లేదా వెబ్ సిరీసా లేదా టాక్ షోనా అనేది చెప్పలేదు. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులలో డిస్కషన్ మొదలైంది.
పీకే... ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ (PK) కొంత పాపులర్ అయ్యారు. ఆయనను పీకే అని సంబోధించిన వైసీపీ నేతలు, ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు పీకే అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే.
డిప్యూటీ సీఎం నుంచి సీఎంగా!
AP Deputy CM Pawan Kalyan: ప్రస్తుతం ఏపీకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఆ పదవి అభిమానులకు సంతృప్తి ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం నుంచి ఆయనను సీఎం పదవిలో చూడాలనేది అభిమానులు, జన సైనికుల కోరిక. 'గేమ్ చేంజర్' విడుదల కార్యక్రమాలలో 'ఖుషి', 'కొమరం పులి' చిత్రాల దర్శకుడు ఎస్.జే. సూర్య అయితే... తన కోరిక సగం తీరిందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పుడు పూర్తి అవుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి పదవి రావడానికి కొంత సమయం వేచి చూడక తప్పదని ఒకట్రెండు సందర్భాలలో తన అభిమానులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీ ఏకంగా 'సీఎం పీకే' అని అనౌన్స్ చేసింది. అందులో పీకే అంటే పవన్ కళ్యాణ్ అట. ఆ విషయాన్ని అధికారికంగా ఎవరూ చెప్పడం లేదు. మరి సీఎం అంటే ఏమిటో తెలియాల్సి ఉంది.
Also Read: జీ తెలుగు సీరియల్స్... మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లో... ప్రతి రోజూ ఏది ఏ టైంలో వస్తుందో తెలుసుకోండి
అల్లు అరవింద్ ఓటీటీలో....
ఆహా ఓటీటీ యజమానులలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం జరుగుతోంది. మెగా హీరోలు అల్లు ఫ్యామిలీ మధ్య ఉప్పు - నిప్పు అన్నట్లు ఉందని కామెంట్లు కూడా వినపడుతున్నాయి. ఈ తరుణంలో 'సీఎం పీకే' పేరుతో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది ఆహా. ఇది ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.