search
×

Diwali 2024: దీపావళి స్పెషల్‌ స్టాక్స్‌ - అనతి కాలంలో అధిక లాభాలు మీ సొంతం!

Muhurat Trading 2024: ఈ సంవత్సరం ముహూరత్‌ ట్రేడ్‌ ద్వారా లాభాలను సంపాదించే వ్యూహాన్ని బ్రోకింగ్‌ కంపెనీ SBI సెక్యూరిటీస్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

Samvat 2081 Stock Picks: దీపావళి రోజున జరిగే ముహూరత్‌ ట్రేడ్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున కొనే స్టాక్స్‌ మళ్లీ వచ్చే దీపావళి నాటి మంచి రిటర్న్స్‌ అందిస్తాయని నమ్ముతారు. ఇందుకోసం, పెద్ద బ్రోకింగ్‌ హౌస్‌లు ప్రకటించే 'దీపావళి స్టాక్ పిక్స్' లిస్ట్‌ కోసం ఎదురు చూస్తుంటారు. SBI సెక్యూరిటీస్, ఈ దీపావళి కోసం తన టాప్ స్టాక్ పిక్స్‌ (Diwali 2024 Stock Picks) జాబితాను విడుదల చేసింది. ఈ షేర్లు పెట్టుబడిదార్లకు బలమైన రాబడిని ఇవ్వగలవని చెబుతోంది. 

SBI సెక్యూరిటీస్‌ లిస్ట్‌లోని దీపావళి స్టాక్ పిక్స్‌

కోల్ ఇండియా (Coal India)
ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాను దీపావళి 2024 టాప్‌ స్టాక్‌గా SBI సెక్యూరిటీస్ ఎంచుకుంది. ఇది, 2025 దీపావళి నాటికి 20.5 శాతం రాబడిని ఇవ్వగలదని, రూ.593 లక్ష్యంతో ఈ కంపెనీ షేర్లను దాదాపు రూ.492 వద్ద కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ హౌస్ సూచించింది.

మాక్రోటెక్ డెవలపర్స్‌ (Macrotech Developers)
బ్రోకరేజ్ హౌస్ మాక్రోటెక్ డెవలపర్స్‌ స్టాక్‌పై కూడా బుల్లిష్‌గా ఉంది. రూ. 1398 టార్గెట్‌ ప్రైస్‌ లేదా దాదాపు 21 శాతం పెరుగుదల కోసం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలని సూచించింది. 

భారతి హెక్సాకామ్ (Bharti Hexacom)
భారతి హెక్సాకామ్ షేర్లను 16 శాతం రిటర్న్‌ లేదా రూ. 1747 లక్ష్యిత ధరతో కొనుగోలు చేయాలంటూ ఎస్‌బీఐ సెక్యూరిటీస్ బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది.

గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మా (Glaxosmithkline Pharma)
ఈ ఫార్మా కంపెనీపైనా SBI సెక్యూరిటీస్ బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్ ప్రస్తుత స్థాయుల నుంచి 20 శాతం రాబడిని ఇవ్వగలదని చెబుతూ, రూ. 3195 టార్గెట్ ప్రైస్‌ ఇచ్చింది. 

నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ (Nippon Life India AMC)
నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ (అసెట్ మేనేజ్‌మెంట్) వైపు సానుకూలంగా చూస్తున్న బ్రోకింగ్‌ కంపెనీ, రూ. 825 లక్ష్యంతో ఈ షేర్లను కొనుగోలు చేయాలని సిఫార్సు చేసింది. ఇది ప్రస్తుత ధర స్థాయి కంటే దాదాపు 18 ఎక్కువ రాబడి.

ఎస్కార్ట్స్ కుబోటా (Escorts Kubota)
SBI సెక్యూరిటీస్ లెక్క ప్రకారం, 2025 దీపావళి నాటికి ఎస్కార్ట్స్ కుబోటా షేర్లు ప్రస్తుత స్థాయుల నుంచి దాదాపు 16 శాతం పెరుగుతాయి, ఒక్కో షేరు ధర రూ. 4,408 వరకు చేరొచ్చు.

చాలెట్‌ హోటల్స్ (Chalet Hotels)
ఈ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ. 1106గా బ్రోకింగ్‌ హౌస్‌ నిర్ణయించింది, ఇది 26.7 శాతం ర్యాలీని సూచిస్తోంది. 

న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (Newgen Software Technologies)
ఈ స్టాక్‌పైనా SBI సెక్యూరిటీస్ బుల్లిష్‌గా ఉంది. ప్రస్తుత స్థాయి కంటే 17 శాతం ఎక్కువ రాబడికి అవకాశం ఉన్న ఈ షేర్లను రూ. 1475 ప్రైస్‌ టార్గెట్‌తో కొనుగోలు చేయాలని సూచించింది.

టిటాగర్ రైల్‌ సిస్టమ్స్‌ (Titagarh Railsystems)
రైల్వే సెక్టార్‌లో పని చేస్తున్న ఈ కంపెనీ షేర్లు సంవత్ 2081లో 26 శాతం పెరుగుతాయని ఊహిస్తూ, రూ. 1510 టార్గెట్‌ ప్రైస్‌తో కొనొచ్చని చెబుతూ బయ్‌ కాల్‌ ఇచ్చింది.

పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ (PG Electroplast)
PG ఎలక్ట్రోప్లాస్ట్‌ షేర్లకు బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన SBI సెక్యూరిటీస్, ఒక్కో షేరు ఏడాదిలో 19 శాతం జంప్‌తో రూ. 735 వరకు పెరగవచ్చని లెక్క గట్టింది. 

అరవింద్ ఫ్యాషన్స్‌ (Arvind Fashions)
20.7 శాతం అప్‌సైడ్‌తో, రూ. 725 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలని బ్రోకింగ్‌ ఫర్మ్‌ సూచించింది.

కిల్బర్న్ ఇంజినీరింగ్ (Kilburn Engineering)
కిల్బర్న్ ఇంజినీరింగ్ షేర్లు కూడా SBI సెక్యూరిటీస్ రాడార్‌లో ఉన్నాయి. 2025 దీపావళి నాటికి ఈ షేర్లు దాదాపు 24 శాతం జంప్‌తో రూ. 532 వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రూ.లక్షకు చేరనున్న పుత్తడి - పెట్టుబడికి ఇదే సరైన సమయమా? 

Published at : 28 Oct 2024 03:19 PM (IST) Tags: Top stock picks Diwali 2024 Diwali Muhurat Trading 2024 Timing Stocks To Trade Shares To Trade

ఇవి కూడా చూడండి

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

టాప్ స్టోరీస్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో

Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం