search
×

Loan With Out interest: వడ్డీ లేకుండా 3 లక్షల అప్పు- సగం చెల్లించాల్సిన పని లేదు- ఇలాంటి ఆఫర్ ఒకటి ఉందని తెలిస్తే వ్యాపారాలు చేయడానికి షటర్లు దొరకవు!

Telugu News మహిళలు ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని అనే స్కీమ్ ద్వారా సాయం చేస్తోంది. దీని ద్వారా రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తోంది. 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తోంది.

FOLLOW US: 
Share:
Empower Women in India : మీరు వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బుల్లేవా..? బయట లక్షలకు లక్షలు అధిక వడ్డీకి తీసుకుని ఇబ్బంది పడుతున్నారా? మూడు లక్షల మేర అప్పిచ్చి.. వడ్డీ కట్టనక్కర్లేదని చెబితే.. ఎలా ఉంటుంది...? ఆ అప్పుని 50 శాతం మాత్రమే తిరిగి కడితే సరిపోతుందని అంటే మీ స్పందదనేంటి? 

ఉద్యోగిని.. మూడు లక్షలు వడ్డీ లేకుంగా.

మహిళలకు ఆర్ధిక స్వావలంబన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకొస్తోంది. దీనిలో భాగంగా కేంద్రం తెచ్చిన పథకమే ‘ఉద్యోగిని’. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు రూ. మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తారు. వడ్డీ లేకుండా అప్పివ్వడమే కాదు.. తీసుకున్న అప్పులో యాభై శాతం వరకు మాఫీ కూడా చేస్తారు. మహిళలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే ఉద్దేశంతో.. నిరుపేద మహిళలకు సైతం వ్యాపారానికి ఎలాంటి ఆర్థిక అవరోధాలు ఉండకూడదనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీని ద్వారా చిన్నతరహా కుటీర పరిశ్రమలు, కిరాణా దుకాణాలు, బేకరీ, బ్యూటీ పార్లర్లు, క్యాంటీన్, కేటరింగ్, కాఫీ, టీ పౌడర్ తయారీ, డయాగ్నస్టిక్ సెంటర్, డ్రై క్లీనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్, టైలరింగ్ షాపులు, అగరబత్తుల తయారీ, పాల డెయిరీ, గ్రంథాలయం, మట్టి పాత్రల తయారీ, గాజుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ వంటి 88 రకాల వ్యాపారాలు చేసేందుకు వీలుంది. 

దీనికి ఎవరు అర్హులు? 

  •  ఈ స్కీమ్ కేవలం మహిళలకోసమే రూపొందించారు. కాబట్టి 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసున్న మహిళలు దరఖాస్తుదారులై ఉండాలి. 
  • వార్షికాదాయం లక్షన్నరకు మించకూడదు. 
  • దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి ఆదాయ గరిష్ట పరిమితి లేదు.
  • క్రెడిట్ స్కోర్ బాగుండాలి. గతంలో లోన్ తీసుకుని ఎగ్గొట్టి ఉండకూడదు. 

ఏమేం డాక్యుమెంట్లు కావాలి..? 

  • మూడు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, రేషన్ లేదా ఓటర్)
  • డీపీఆర్( డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) అంటే.. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దానికి ఎంత ఖర్చు అవుతుంది? రాబడి వచ్చే మార్గాలేంటి తదితరాలతో కూడిన ఒక నివేదిక. 
  • ఏ రంగంలో వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాంట్లో గతంలో ఉన్న అనుభవం తాలూకు ధ్రువ పత్రాలు లేదా.. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు.. 
  • కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం.. 
  • కుల ధ్రువీకరణ పత్రం. 
  • వ్యాపారానికి అయ్యే పెట్టుబడిపై కొటేషన్..  

ఎలా దరఖాస్తు చేయాలి..? 

  • దీనికోసం సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ నుంచి ఉద్యోగిని స్కీమ్‌కి చెందిన దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. 
  •  దాన్ని పూర్తిగా ఫిల్ చేసి మీ దగ్గరున్న డాక్యుమెంట్లు జత చేసి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో బ్యాంకు మేనేజర్‌ని కలిసి ఆయన కన్విన్స్ అయ్యేదా దానిపై వివరించాలి. 
  • మీరు సమర్పించిన డీపీఆర్ ద్వారా మీరు లోన్ తిరిగి చెల్లించగలరని సంబంధిత బ్యాంకు మేనేజర్ నమ్మితే మీకు లోన్ కచ్చింతంగా వస్తుంది.

ఎవరెవరికి ఎలా వర్తిస్తుంది..?

  • ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కనీసం రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల వరకు రుణాలిస్తారు. దీంట్లో 50 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ కూడా ఉండదు.
  • బీసీ, జనరల్ వర్గాలకు చెందిన మహిళలకు రూ. మూడు లక్షల వరకు రుణాలిస్తారు. 30 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ బ్యాంకులను బట్టీ 8 నుంచి 12 శాతం లోపు ఉంటుంది.  
Published at : 08 May 2024 07:25 AM (IST) Tags: Women Empowerment 3lakhs loan loan without interest subsidised loan contral government udyogini scheme

ఇవి కూడా చూడండి

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు -  ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!

Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!

Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?

Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?

Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!

Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!

టాప్ స్టోరీస్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు