search
×

Bima Sugam portal: ఇన్సూరెన్స్ మోసాలకు చెక్ పెట్టే అస్త్రం- గేమ్‌ ఛేంజర్‌ 'బీమా సుగమ్' పోర్టల్ ప్రారంభం

'బీమా సుగమ్' పోర్టల్ కొత్త అధ్యాయం. ఇది కేవలం పాలసీల కొనుగోలు, పునరుద్ధరణ, క్లెయిమ్‌ల పరిష్కారమే కాదు, అవగాహన పెంచి, ఆర్థిక భద్రత ఇస్తుంది. బీమా రంగం ప్రపంచంలో ఈ 'గేమ్ ఛేంజర్'గా మారుతుంది.  

FOLLOW US: 
Share:

Bima Sugam portal: భారతదేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధార్, UPI వంటివి సాధారణ ప్రజల జీవితాలను ఎంతగా మార్చేశాయో మనకు తెలుసు. ఇప్పుడు, అటువంటి మరో అద్భుతమైన డిజిటల్ వేదిక ఆవిష్కృతమైంది. అదే 'బీమా సుగమ్'పోర్టల్ (Bimasugam.co.in). ఇది కేవలం ఒక వెబ్‌సైట్ కాదు, ఇది భారతదేశ బీమా రంగానికి 'యూపీఐ మొమెంట్' లాంటిది. దేశంలోని ప్రతి పౌరుడికి బీమా సేవలను చేరువచేయడానికి, సులభతరం చేయడానికి రూపొందించిన వేదిక. సెప్టెంబర్ 18, 2025న అధికారికంగా ప్రారంభించిన ఈ పోర్టల్, '2047 నాటికి అందరికీ బీమా ' అనే లక్ష్యాన్ని సాధించడంలో కీలక ముందడుగు. ఈ పోర్టల్ ద్వారా బీమా తీసుకోవడం, పునరుద్ధరణ, క్లెయిమ్‌లను పరిష్కరించడం మరింత పారదర్శకంగా, సులభంగా మారనున్నాయి.

బీమా సుగమ్ పోర్టల్ అధికారికంగా ప్రారంభమైంది. bimasugam.co.in ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇన్సూరెన్స్. అంటే, ఒకే చోట, ఒకే ఆన్‌లైన్ వేదికలో, జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా (Health Insurance), మోటార్ బీమా (Motor Insurance), ప్రయాణ బీమా (Travel Insurance), ఆస్తి బీమా (Property Insurance), వ్యవసాయ బీమా (Agriculture Insurance) వంటి అన్ని బీమా సేవలు లభిస్తాయి. ఈ పోర్టల్ ఫీచర్‌లు దశలవారీగా అమలు చేయనున్నారు. మొదట్లో సమాచారం, మార్గదర్శక కేంద్రంగా పనిచేస్తుంది, ఆపై బీమా సంస్థలు, భాగస్వాములతో అనుసంధానించిన తర్వాత పూర్తిస్థాయి లావాదేవీలు అందుబాటులోకి వస్తాయి. మొదటి దశ డిసెంబర్ 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా), BSIF (బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్) మద్దతుతో ఈ పోర్టల్ ప్రతి భారతీయుడికి సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పారదర్శకమైన సేవలను అందించడానికి రూపందించారు. ఇది కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, ఇది దేశ ప్రజలకు ఆర్థిక భద్రతను అందించే ఒక మహా సంకల్పంగా ప్రభుత్వం చెబుతోంది. 

బీమా రంగంలో యూపీఐ: బీమా సుగమ్ ను 'బీమా యూపీఐ' (UPI for Insurance) అని ఎందుకు పిలుస్తున్నారంటే, ఇది యూపీఐ డిజిటల్ చెల్లింపుల కోసం బ్యాంకులను ఎలా కనెక్ట్ చేసిందో, అలాగే ఈ ప్లాట్‌ఫారమ్ బీమా సంస్థలు, మధ్యవర్తులు, కస్టమర్‌లను కలుపుతుంది. ప్రైవేట్ బీమా అగ్రిగేటర్‌లా కాకుండా, బీమా సుగమ్ అనేది బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (BSIF) కింద అన్ని బీమా కంపెనీల మద్దతుతో పనిచేస్తుంది. IRDAI నియంత్రలో ఉంటుంది. ఇది కేవలం పాలసీలను పంపిణీ చేసి అధిక కమీషన్లు సంపాదించే ప్రైవేట్ అగ్రిగేటర్ల వలె కాకుండా, క్లెయిమ్ సెటిల్‌మెంట్ సహా అన్ని సేవలను అందిస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో, సమగ్రంగా, పారదర్శకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఈ పోర్టల్ అత్యంత శక్తివంతమైన లక్షణాలలో ఒకటి 'బీమా పెహచాన్' (Bima Pehchaan). ఇది పాలసీదారులందరికీ ఒక శాశ్వత డిజిటల్ ఇన్సూరెన్స్ ఐడీ (Digital Insurance ID). ఈ ఒకే ID ద్వారా మీ ప్రస్తుత, భవిష్యత్ బీమా పాలసీలన్నీ అనుసంధనమవుతాయి. ఆధార్ (Aadhaar), PAN, మొబైల్ ఆధారిత లాగిన్‌తో సురక్షితమైన యాక్సెస్ ఉంటుంది, మీ గోప్యతకు భంగం కలగదు. బీమా సంస్థ మారినా కూడా మీ పాలసీ రికార్డులు జీవితకాలం పాటు నిలిచి ఉంటాయి. క్లెయిమ్ దాఖలు చేయడం , నామినీ అప్‌డేట్‌లు , ఫిర్యాదుల పరిష్కారం అన్నీ ఒకే చోట సులభంగా చేసుకోవచ్చు.

ఇతర ముఖ్య లక్షణాలు:

సింగిల్ డాష్‌బోర్డ్ : అన్ని బీమా సంస్థల నుంచి మీ అన్ని పాలసీలను ఒకే చోట చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు అన్ని పాలసీల స్టాటస్‌ను ఒకేచోట చూసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది.

తక్షణ పాలసీ కొనుగోలు : ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లింపుతో మీకు కావలసిన ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఇకపై ఏజెంట్‌ల కోసం లేదా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

ఆధార్ ఆధారిత ఈ-కేవైసి : కాగిత రహిత ఆన్‌బోర్డింగ్. పత్రాల సబ్‌మిషన్ సులభం, వేగవంతం అవుతాయి. 

ఆటంకం లేని క్లెయిమ్‌లు : రియల్ టైంలో క్లెయిమ్ సమర్పణ, ట్రాకింగ్. మీ క్లెయిమ్ స్టాట్ ఏంటీ, ఎప్పుడు పరిష్కారమవుతుంది వంటి వివరాలను మీ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు.

పారదర్శకత & పోలిక : వివిధ బీమా ప్రోడక్ట్స్‌ను సరిపోల్చి, మీకు తగినదాన్ని ఎంచుకోవచ్చు. ఇది ఉత్తమ బీమా పాలసీని ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.

కనీస ఛార్జీలు : చాలా తక్కువ ఛార్జీలతో సేవలను పొందవచ్చు. ఏజెంట్ కమీషన్లు తగ్గుతాయి కాబట్టి ప్రీమియంలు కూడా తగ్గవచ్చు. ఇది వినియోగదారులకు తక్కువ ఖర్చుతో బీమా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఈ ఫీచర్‌లన్నీ కలిసి బీమా కొనుగోలుదారుల జీవితాన్ని సులభతరం చేస్తాయి, వారికి మరింత శక్తినిస్తాయి . బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకువస్తాయి.

పాలసీదారులకు సాధికారత, విస్తరిస్తున్న కవరేజ్: వందలాది బీమా పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన ఎంపిక చేసుకోవడానికి కస్టమర్‌లు తరచుగా ఇబ్బందులు పడుతుంటారు. బీమా సుగమ్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది, పారదర్శకంగా వారికి అత్యంత అనుకూలమైన ప్లాన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది బీమా సంస్కరణల దిశగా ఒక కీలక ముందడుగు, పాలసీదారులకు సాధికారత కల్పిస్తుంది, బీమా విస్తరణను పెంచుతుంది, పారదర్శకంగా ఉండేలా చూస్తుంది. 

గతంలో, గ్రామీణ ప్రాంతాలలో బీమా కొనుగోలు ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. ఈ పోర్టల్ ద్వారా, గ్రామీణ, పట్టణ భారతదేశం అంతటా బీమా వ్యాప్తిని పెంచడమే లక్ష్యంగా ఉంది. కస్టమర్‌లు ఇకపై శారీరకంగా కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు; అంతా ఆన్‌లైన్‌లో ఒకే చోట అందుబాటులో ఉంటుంది. కేవలం KYC వివరాలను నమోదు చేస్తే, మిగిలిన సమాచారం ఆటోమెటిక్‌గా వస్తుంది. బీమా సుగమ్ కేవలం ఒక పోర్టల్ కాదు; ఇది భారతదేశంలో బీమా భవిష్యత్తును సూచిస్తుంది. ఇది డిజిటల్ ఇండియా (Digital India) కలలను నిజం చేసే దిశగా వేసిన ఒక ముందడుగు.

Published at : 18 Sep 2025 03:59 PM (IST) Tags: IRDAI Bima Sugam portal Digital Insurance Insurance for All 2047 Bima Pehchaan online insurance

ఇవి కూడా చూడండి

Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్‌, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?

Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్‌, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Silver Price: బంగారానికి పోటీగా వెండి రికార్డు పరుగు! 1.77 లక్షలకు చేరిన ధర

Silver Price: బంగారానికి పోటీగా వెండి రికార్డు పరుగు! 1.77 లక్షలకు చేరిన ధర

Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు

Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు

ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !

ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !

టాప్ స్టోరీస్

Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?

Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?

Janasena Clarity: దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి

Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి

Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం

Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం

Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం

Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం