By: ABP Desam | Updated at : 31 Aug 2023 03:49 PM (IST)
పొదుపు చేసి అదే ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటున్నారా?
Principles Of Investment: మన దేశ ప్రజల్లో, ఎక్కువ మందిలో పొదుపు అలవాటు ఉంది. కానీ, పెట్టుబడి అలవాటు, అవగాహన ఉన్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఇండియాలోని 140 కోట్ల జనాభాలో, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్లు కేవలం 5-6 శాతం మంది మాత్రమే. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమే దీనికి కారణం. చాలామంది తమ డబ్బును పొదుపు ఖాతాల్లో దాస్తూ, భవిష్యత్ అవసరాలకు అది ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ, సేవింగ్స్ అకౌంట్స్‌లో వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణం రేటు కంటే చాలా తక్కువగా ఉంటుందని గ్రహించడం లేదు. దీనివల్ల, వాళ్ల డబ్బు విలువ ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంటుంది.
చేతిలో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చకపోవడం ఆ డబ్బు వృథా చేసిన దాంతో సమానం. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల మాత్రమే కాదు, డబ్బు విలువ పతనం కూడా. చిన్న ఉదాహరణ చూద్దాం... ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే, 25 ఏళ్ల తర్వాత ఆ డబ్బుతో కేవలం రూ.22 వేల విలువైన వస్తువులను మాత్రమే (వార్షిక ద్రవ్యోల్బణం రేటు 6 శాతంగా ఉంటే) కొనగలరు. డబ్బు విలువ పడిపోవడం అంటే ఇదే. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, ద్రవ్యోల్బణం రేటు కంటే వేగంగా పెరిగే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, ద్రవ్యోల్బణంలో 6 శాతం అంచనా పెరుగుదలతో పోలిస్తే ఈక్విటీలు వార్షికంగా సగటున 13 శాతం వృద్ధి చెందాయి.
చిన్న మొత్తం ఉన్నా పెట్టుబడి స్టార్ట్ చేయండి
మీ దగ్గర తక్కువ డబ్బే ఉన్నా, ముందు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. దానిని దీర్ఘకాలం కొనసాగించండి. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం, తక్కువ మొత్తంతో ఎక్కువ సంపదను సృష్టించగల స్ట్రాంగ్ స్ట్రాటెజీ. ఉదాహరణకు, మీరు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా ప్రతి నెలా రూ. 5,000 ఇన్వెస్ట్ చేస్తే, ఆ పథకం మీకు 25 సంవత్సరాల్లో 13% సగటు వార్షిక రాబడిని అందిస్తుందని భావిస్తే, పాతికేళ్లలో రూ.1 కోటి కంటే ఎక్కువ కార్పస్ సృష్టించవచ్చు. చక్రవడ్డీకి ఉన్న శక్తి (magic of compounding) ఇది.
స్టాక్ మార్కెట్‌లో స్వల్పకాలిక ఒడిదొడుకులను పట్టించుకోవద్దు, దీర్ఘకాలిక లాభాల కోసం మంచి కంపెనీలపై దృష్టి పెట్టండి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా నిప్టీ 50 కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి. ఇండెక్స్ ఫండ్స్ అనేవి పాసివ్ ఫండ్స్. మార్కెట్ తరహాలోనే రాబడి ఇస్తాయి.
రిస్క్-రిటర్న్‌పై నిఘా
సాధారణంగా, ఇన్వెస్టర్లు వార్షిక రాబడి ఆధారంగా మాత్రమే ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే రిస్క్‌ను చూడటం కూడా చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న ఫండ్ మీకు ప్రతి సంవత్సరం స్థిరమైన రాబడిని ఇస్తుందా, లేదా హెచ్చుతగ్గులకు లోనవుతుందా? అన్నది చూడాలి. తక్కువ రిస్క్‌తో అధిక రాబడిని ఇచ్చే ఫండ్‌ను ఎంచుకోవాలి.
ఈక్విటీల్లో పెట్టుబడులు - పన్ను ఆదా
ELSS లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లోని ఒక వర్గం. ఇది, మార్కెట్‌కు తగ్గట్లు ఆదాయం ఇవ్వడంతో పాటు, ఇన్‌కమ్ టాక్స్‌ను కూడా ఆదా చేస్తుంది. పాత పన్ను విధానం ఎంచుకున్న పెట్టుబడిదార్లు ELSS ద్వారా సెక్షన్ 80C కింద రూ.46,800 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ తరహా పెట్టుబడుల్లో సాధారణంగా కనీసం మూడు సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్
రిస్క్‌ను తగ్గించుకోవడానికి మీ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం (డైవర్సిఫికేషన్) ముఖ్యం. వేర్వేరు అసెట్ క్లాస్‌లు వేర్వేరు పరిస్థితులలో విభిన్నంగా పనిచేస్తాయి. అందువల్ల, ఒకే స్టాక్, ట్రేడ్ లేదా ఒకే అసెట్ క్లాస్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్, ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డెట్ అసెట్స్‌లో మీ డబ్బులోని కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టండి. ఇది, మార్కెట్ తుపాను నుంచి మీ పెట్టుబడిని కాపాడుతుంది.
రెగ్యులర్ ప్లాన్‌ల కంటే డైరెక్ట్ ప్లాన్ బెటర్
మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ కొంటే ఎక్కువ ఫీజులు, కమీషన్‌లు చెల్లించాల్సి వస్తుంది. డైరెక్ట్ ప్లాన్‌లో చాలా తక్కువ ఛార్జీలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం అంటే, ఆ ఉత్పత్తిని నేరుగా కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్లే. దీనివల్ల, మధ్యవర్తులు ఉండరు, ఖర్చు తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఖర్చులు, కమీషన్ల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: 10k మైలురాయిని క్రాస్ చేసిన మారుతి, ఈ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్