By: ABP Desam | Updated at : 30 Nov 2023 01:19 PM (IST)
జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ
LIC Jeevan Utsav Policy Details: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC), కొత్త పాలసీని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ పాలసీ ద్వారా.. పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌ను ఇస్తామని ఎల్‌ఐసీ ప్రమాణం చేస్తోంది. కొత్త పాలసీ పేరు జీవన్ ఉత్సవ్ ( LIC Jeevan Utsav). ఇది ప్లాన్ నంబర్ 871 (Plan No 871).
జీవన్ ఉత్సవ్ పాలసీని ఈ నెల 29న మార్కెట్‌కు LIC పరిచయం చేసింది. ఈ పాలసీని LIC ఏజెంట్ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో గానీ తీసుకోవచ్చు. ఈ పాలసీ కొన్నాక, నిర్ణీత కాలం పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం కట్టడం పూర్తి కాగానే వెయిటింగ్ పిరియడ్ ప్రారంభమవుతుంది. వెయిటింగ్ పిరియడ్ ముగిసిన తర్వాత నుంచి జీవితాంతం ఆదాయం (Income for life long) పొందొచ్చు. హామీ ఇచ్చిన మొత్తంలో 10% డబ్బును రెగ్యులర్ ఇన్‌కమ్ రూపంలో ఎల్‌ఐసీ చెల్లిస్తుంది.
జీవన్ ఉత్సవ్ పాలసీ వివరాలు (LIC Jeevan Utsav Policy Details in Telugu)
90 రోజుల చిన్నారుల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మొత్తం మారుతుంది. ప్రీమియం చెల్లింపు టైమ్ పిరియడ్‌ను ఎక్కువగా పెట్టుకున్నా చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. పాలసీ కట్టడం ప్రారంభమైన రోజు నుంచి జీవితాంతం బీమా కవరేజ్ లభిస్తుంది.
పాలసీ తీసుకున్న తర్వాత... 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. దీనిని నెలకు ఒకసారి, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చొప్పున చెల్లించవచ్చు.
కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు. ప్రీమియం చెల్లింపు కాలాన్ని బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతుంది.
5 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వెయిటింగ్ పిరియడ్ 5 సంవత్సరాలు
6 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే 4 సంవత్సరాల వెయిటింగ్ పిరియడ్
7 సంవత్సరాల పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే వెయిటింగ్ పిరియడ్ 3 సంవత్సరాలు
8-16 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే 2 ఏళ్ల పాటు వెయిట్ చేయాలి
వెయిటింగ్ పీరియడ్ ముగిసిన నాటి నుంచి, మీకు జీవితాతం ఆదాయాన్ని ఎల్‌ఐసీ పంపుతుంది. బీమా హామీ మొత్తంలో 10 శాతాన్ని ఏటా అందిస్తుంది. పాలసీదారు జీవించి ఉన్నంతకాలం ఈ హామీ మొత్తాన్ని పొందొచ్చు.
రెండు ఆప్షన్‌లు - చక్రవడ్డీ ప్రయోజనం (Benefit of compound interest)
రెగ్యులర్ ఇన్‌కమ్ వద్దనుకుంటే మరో మార్గం కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంది. అది, ఫ్లెక్సీ ఇన్‌కమ్. మొదటి ఆప్షన్‌లో... ప్రతి ఏడాది చివరన, బీమా బేసిక్ మొత్తం నుంచి 10 శాతం ఆదాయం వస్తుంది. రెండో ఆప్షన్‌లో... బీమా మొత్తంలో 10 శాతం లభిస్తుంది. ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోకుండా LIC వద్దే ఉంచితే, 5.5% శాతం చొప్పున చక్రవడ్డీ జమ అవుతుంది. దీనివల్ల పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టవచ్చు. మీకు డబ్బు అవసరమైతే, అప్పటివరకు పోగైన మొత్తంలో 75% నగదును వెనక్కు తీసుకోవచ్చు. మిగిలిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది.
ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే పాలసీ ఆగిపోతుంది. అప్పటివరకు పోగైన మొత్తం + డెత్ బెనిఫిట్స్ కలిపి నామినీకి చెల్లిస్తారు.
పాలసీ చెల్లింపు కాలంలో పాలసీదారు కట్టిన ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారెంటీ అడిషన్స్ కింద LIC చెల్లిస్తుంది.
డెత్ బెనిఫిట్ (LIC Jeevan Utsav Death Benefit)
పాలసీదారు మరణిస్తే, డెత్ ఇన్సూరెన్స్ అమౌంట్ + గ్యారెంటీడ్ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. డెత్ ఇన్సూరెన్స్ అమౌంట్ లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్ల మొత్తంలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం నామినీకి అందుతుంది.
జీవన్ ఉత్సవ్ పాలసీకి రైడర్లను (అదనపు బీమా కవరేజ్) కూడా యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. యాక్సిడెంట్‌లో చనిపోతే లేదా అవయవాలు కోల్పోతే అదనపు ఆర్థిక మద్దతు, ప్రీమియంపై డిస్కౌంట్ వంటివి రైడర్స్ ద్వారా అందుతాయి.
లోన్ కూడా తీసుకోవచ్చు (Loan Fecility with LIC Jeevan Utsav)
జీవన్ ఉత్సవ్ పాలసీపై లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు ప్రారంభమైన తర్వాత రుణం తీసుకోవచ్చు. అప్పుపై చెల్లించే వడ్డీ, రెగ్యులర్ ఆదాయంలో 50% దాటకూడదన్న రూల్ ఉంది.
మరో ఆసక్తికర కథనం: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి