By: ABP Desam | Updated at : 02 Sep 2023 10:55 AM (IST)
ఆగస్టులో చాలా బ్యాంక్‌లు FD రేట్లను మార్చాయి
Fixed Deposit: మన దేశంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ మార్గాల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఆగస్టు నెలలో, రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను (Interest Rate on Fixed Deposits) సవరించిన ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకుల లిస్ట్ ఇది:
వివిధ బ్యాంకుల్లో రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన FDలపై వడ్డీ రేట్లు:
కెనరా బ్యాంక్
ఈ PSB (ప్రభుత్వ రంగ బ్యాంక్), తన FD రేట్లను ఆగస్టు 12న రివైజ్ చేసింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే రూ.2 కోట్ల కంటే తక్కువ FDలపై, సాధారణ ప్రజలకు 4% నుంచి 6.70% వరకు; సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 7% వరకు వడ్డీ రేట్లను కెనరా బ్యాంక్ ఇస్తోంది. 444 రోజుల డిపాజిట్ కోసం, సీనియర్ సిటిజన్లు కానివారు గరిష్టంగా 7.25%, సీనియర్ సిటిజన్లు 7.75% రాబడిని పొందుతారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన FD రేట్లను ఆగస్టు 10న సవరించింది. కొత్త రేట్ల ప్రకారం... 7 రోజుల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.50% నుంచి 6.25%; సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 6.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 1 నుంచి 3 సంవత్సరాల టెన్యూర్స్‌లో సాధారణ ప్రజలు గరిష్టంగా 6.75% రాబడిని పొందొచ్చు, సీనియర్ సిటిజన్లు 7.25% పొందొచ్చు.
యాక్సిస్ బ్యాంక్
ఈ ప్రైవేట్ రంగ రుణదాత, తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆగస్టు 28న మార్చింది. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 3.50% నుంచి 7% వరకు; సీనియర్ సిటిజన్లకు 6% నుంచి 7.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 13 నెలల నుంచి 30 నెలల FD వ్యవధిలో, సీనియర్ సిటిజన్లు కానివారు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లు 7.85% రాబడిని డ్రా చేయవచ్చు.
DCB బ్యాంక్
DCB బ్యాంక్, తన FDలపై వడ్డీ రేట్లను ఆగస్టు 17న రివైజ్ చేసింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో, బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 3.75% నుంచి 7.25% వరకు; సీనియర్ సిటిజన్లకు 4.25% నుంచి 7.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 700 రోజుల నుంచి 36 నెలల వరకు కాల గడువులో, నాన్-సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.75%, సీనియర్ సిటిజన్లకు 8.50% రాబడిని DCB బ్యాంక్ వాగ్దానం చేసింది.
ధనలక్ష్మి బ్యాంక్
ఆగస్టు 1న, ధనలక్ష్మి బ్యాంక్ తన FDపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 5.75% నుంచి 6.60% వరకు వడ్డీ రేట్లు లభిస్తాయి. 555 రోజుల (18 నెలల 7 రోజులు) కాల వ్యవధిలో, బ్యాంక్ గరిష్టంగా 7.25% రాబడిని ప్రామిస్ చేసింది. ఒక సంవత్సరం, అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని దేశీయ టర్మ్ డిపాజిట్ల మీద 0.50% అదనపు వడ్డీ రేటుకు సీనియర్ సిటిజన్లు అర్హులు.
ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్, ఆగస్టు 15న, FD స్కీమ్‌లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. 7 రోజుల నుంచి 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ FD టెన్యూలపై సాధారణ ప్రజలకు 3% నుంచి 6.60%; సీనియర్ సిటిజన్లకు 3.50% నుంచి 7.25% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంక్ చెల్లిస్తోంది. 13 నెలల నుంచి 21 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్‌లపై నాన్-సీనియర్ సిటిజన్స్ గరిష్టంగా 7.30%, సీనియర్ సిటిజన్‌లు 8.07% వడ్డీ రేటును పొందుతారు.
ఇండస్ఇండ్ బ్యాంక్
ప్రైవేట్ రంగ లెండర్ ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆగస్టు 5న FD రేట్లను రివైజ్ చేసింది. 7 రోజుల నుంచి 61 నెలలు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఈ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3.50% నుంచి 7% వరకు; సీనియర్ సిటిజన్లకు 4.25% నుంచి 7.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.50%, సీనియర్ సిటిజన్లకు 8.25% వడ్డీ రేటు లభిస్తుంది.
కరూర్ వైశ్యా బ్యాంక్
కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా, రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను ఆగస్టు 16న సవరించింది, చిన్నపాటి మార్పులు చేసింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Balakrishna : సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!