By: ABP Desam | Updated at : 07 Apr 2022 01:27 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గుడ్‌న్యూస్! ఈ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు 25% సాలరీ హైక్ - మిగతావాళ్లకి 9% పెంపు
India Inc salary Hike 2022: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రైవేటు రంగంలోని వారికి ఈ ఆర్థిక ఏడాదిలో వేతనాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కనీసం 8-12 శాతం వరకు పెరుగుతాయని తాజా నివేదికలో తెలిసింది. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు వాతావరణం అనువుగా ఉండటంతో కంపెనీలు సగటున 9 శాతం హైక్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందుకు దోహదం చేస్తోంది. కరోనా ముందు 2019లోని 7 శాతం సగటు పెంపుతో పోలిస్తే 2022లో 9 శాతంగా ఉందని మైకేల్ పేజ్ సాలరీ రిపోర్టు 2022 తెలిపింది.
యూనికార్న్, కొత్త తరహా స్టార్టప్పులు, పెద్ద సంస్థలు 12 శాతం వరకు వేతనాలు పెంచుతాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ, కన్స్‌స్ట్రక్షన్ వంటి గ్రోత్ కంపెనీలు దీనిని కొనసాగిస్తాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ-కామర్స్, ఇతర సంస్థలు డిజిటలైజ్ అవుతుండటంతో కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సీనియర్ లెవల్ ఉద్యోగులు తమ వేతనాలను భారీ పెంచుకొనేందుకు డిమాండ్ చేయొచ్చని నివేదిక తెలిపింది. వారి జీతాలు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ పెరుగుతాయని పేర్కొంది. డేటా సైంటిస్టులు, వెబ్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది. మంచి యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందిన వారికీ డిమాండ్ పెరుగుతోంది.
ఒకే తరహా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఉన్న ఉన్నతోద్యోగులతో పోలిస్తే టెక్నాలజిస్టులు సగటు వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల్లో టాప్ ఫెర్ఫామర్లకు కంపెనీలు స్వల్పకాల, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అప్రైజల్స్, ప్రమోషన్లు, వేరియబుల్ పేమెంట్లు, స్టాక్ ఇన్సెంటివులు, రీటెన్షన్ బోనసులు, మిడ్ టర్మ్ ఇంక్రిమెంట్ల రూపంలో వేర్వేరు ఆఫర్లు ఇవ్వనున్నాయి.
మున్ముందు కరోనా వైరస్‌తో ఎక్కువ ఇబ్బందులు ఉండకపోవచ్చని కంపెనీలు, యజమానాలు భావిస్తున్నారు. మార్కెట్‌పై దాని ప్రభావం ఎక్కువగా ఉండదని అంచనా వేస్తున్నారు. అందుకే బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇవ్వనున్నాయి. వీరికి కనీసం 20-25 శాతం సగటు ఇంక్రిమెంట్లు ఉంటాయని నివేదిక తెలిపింది. 'కరోనా మహమ్మారిని మనం దాటేశామన్న సానుకూల దృక్పథం అందరిలోనూ ఉంది. ఉద్యోగ నియామకాల మార్కెట్ సైతం బాగా పుంజుకుంది. బెస్ట్ టాలెంట్‌ను ఒడిసిపట్టేందుకు కంపెనీలు తెలివైన వారికి ఆకర్షించేందుకు ఆఫర్లు ఇస్తున్నారు' అని నివేదిక వెల్లడించింది.
'అట్రిషన్ రేటు పెరుగుతుండటంతో టాలెంట్ కొరత ఏర్పడుతోంది. మంచి నైపుణ్యాలు ఉన్న వారి వేతనాలు పెంచేందుకు ఇది దోహదం చేస్తోంది. వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ప్రతిభ ఉన్నవారినే కాకుండా నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ బాగున్నవారిని కంపెనీలు తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వాతావరణం, ఉద్యోగి సంక్షేమం కోరే కంపెనీలకే ఉద్యోగులు ఓటేసే అవకాశాలు ఎక్కువ' అని మైకేల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల అన్నారు.
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య