search
×

Akshaya Tritiya 2023: అక్షత తృతీయ ఆఫర్లు అదుర్స్ - ఫ్రీ గోల్డ్ కాయిన్, భారీగా మేకింగ్ ఛార్జీలు తగ్గింపు!

Akshaya Tritiya 2023 Offers: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా.. కస్టమర్‌లను ఆకర్షించడానికి అనేక ఆభరణాల బ్రాండ్‌లు తమ మేకింగ్ ఛార్జీలపై 50% వరకు తగ్గింపు ఇచ్చేందుకు నిర్ణయించాయి.

FOLLOW US: 
Share:

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ (అక్షయ తృతీయ 2023) రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆరోజు బంగారం కంటే చాలా మంచిదని అంతా నమ్ముతుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, అదృష్టం లభిస్తుందని కూడా ప్రజల విశ్వాసం. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన వస్తోంది. అక్షయ తృతీయ పర్వదినం దగ్గర పడుతున్నా కొద్దీ బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు జ్యువెల్లరీ దుకారణాలకు పరుగులు పెడుతున్నారు. అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, డైమండ్స్ వంటివి కూడా కొంటుంటారు. కానీ బంగారం ధరలు పెరుగతుండడంతో పసిడిని కొనేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈక్రమంలోనే కస్టమర్లను ఆకర్షించేందుకు చాలా మంది పెద్ద పెద్ద జ్యువెల్లర్లు అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌లను తీసుకొచ్చారు.

50% వరకు తగ్గింపు లభిస్తుంది..

అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా.. కస్టమర్‌లను ఆకర్షించడానికి అనేక ఆభరణాల బ్రాండ్‌లు తమ మేకింగ్ ఛార్జీలపై 50% వరకు తగ్గింపు ఇచ్చేందుకు నిర్ణయించాయి. బంగారు మరియు వజ్రాభరణాలపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుందని తెలిపాయి. అయితే ఏయే బ్రాండ్లు ఆఫర్లు అందిస్తున్నాయి, ఎంత మేర అందిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

1. తనిష్క్‌పై భారీ తగ్గింపు..

అక్షయ తృతీయ సందర్భంగా టాటా యొక్క ఆభరణాల బ్రాండ్ తనిష్క్ మేకింగ్ ఛార్జీలపై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. కంపెనీ బంగారు ఆభరణాలు మరియు వజ్రాభరణాల కొనుగోలుపై.. వినియోగదారులు మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు పొందుతారు. ఈ ఆఫర్ ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 3 లక్షల వరకు మేకింగ్ ఛార్జీలపై 10%, రూ. 3 నుంచి 7 లక్షల వరకు 15%, రూ. 7 నుంచి 15 లక్షల వరకు 20%, రూ. 15 లక్షలకు పైబడిన వాటిపై 25% తగ్గింపు ఇవ్వనుంది.

2. మలబార్ గోల్డ్, డైమండ్‌పై భారీ తగ్గింపు..

అక్షయ తృతీయను పుర్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా ఉచిత బంగారు నాణేల ఆఫర్‌ను తీసుకువచ్చాయి. రూ. 30,000 కంటే ఎక్కువ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే.. వినియోగదారులకు 100 మిల్లీ గ్రాముల బంగారు నాణెం లభిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30వ తేదీ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

3. సెన్కో గోల్డ్ నుండి గొప్ప ఆఫర్..

అక్షయ తృతీయ సందర్భంగా సెన్కో గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ ద్వారా బంగారం మరియు వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 50 శాతం తగ్గింపు ఇస్తోంది. ఇదే సమయంలో బ్రాండ్ కస్టమర్‌లకు డైమండ్ నగలపై 12 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. మరోవైపు మీరు పాత ఆభరణాలకు బదులుగా కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తే.. దానిపై 0% తగ్గింపు రుసుము వసూలు చేస్తామని ప్రకటించింది.

4. పీసీ చంద్ర జ్యువెలర్స్ భారీ డిస్కౌంట్లు..

పీసీ చంద్ర జ్యువెలర్స్.. అక్షయ తృతీయ పండుగ సందర్భంగా అన్ని రకాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 15 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ఇదే సమయంలో డైమండ్ మరియు స్టోన్ కొనుగోలుపై 10 శాతం వరకు తగ్గింపు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 15వ తేదీ 2023 నుండి 2023 ఏప్రిల్ 23 వరకు అందుబాటులో ఉంటుంది. 

Published at : 14 Apr 2023 01:50 PM (IST) Tags: Gold jewellery Akshaya Tritiya Gold akshaya tritiya 2023 Gold And Silver

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

టాప్ స్టోరీస్

Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్

Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్

Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం

Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం

Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం