By: ABP Desam | Updated at : 17 Apr 2023 02:55 PM (IST)
బంగారం ధర ఎంత మారిందో తెలుసా?
Akshaya Tritiya 2023: ఈ నెల 22న, శనివారం నాడు వచ్చిన అక్షయ తృతీయ ఒక పవిత్రమైన పండుగ. అక్షయ తృతీయ నాడు బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా శుభప్రదంగా హిందువులు భావిస్తారు. ప్రతి ఒక్కరు తమ బడ్జెట్‌కు అనుగుణంగా, కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా అక్షయ తృతీయ నాడు కొనడానికి ప్రయత్నిస్తారు.
గత కొన్ని నెలలుగా, బంగారంపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు విపరీతమైన రాబడిని తిరిగి వచ్చింది. అయితే, 20 ఏళ్ల క్రితం, అంటే 2003లో అక్షయ తృతీయ నాడు బంగారం ధర ఎంత ఉందో మీకు తెలుసా?
20 ఏళ్లలో 1000% పెరిగిన బంగారం ధర
2003లో, అక్షయ తృతీయ పండుగను మే నెల 4వ తేదీన జరుపుకున్నారు. ఆ రోజు, 10 గ్రాముల బంగారం ధర రూ. 5,656 గా ఉంది. ఇప్పుడు, 2023లో, అక్షయ తృతీయ పండుగకు ముందే 10 గ్రాముల పసిడి రేటు రూ. 60,560 గా ట్రేడవుతోంది. ఈ 20 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 54,900 పెరిగింది. అంటే, రెండు దశాబ్దాల్లో ఏళ్లలో బంగారం ధర 1000 శాతం లేదా 10 రెట్లు పెరిగింది. 20 ఏళ్ల క్రితం అక్షయ తృతీయ నాడు లక్ష రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.10 లక్షల వరకు పెరిగి ఉండేది.
20 ఏళ్లలో వెండి ధర కూడా 900 శాతం పెరిగింది
బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా ఈ 20 ఏళ్లలో 900 శాతం పెరిగింది. 2003 మే 4వ తేదీన కిలో వెండి రూ. 7,550 వద్ద ట్రేడయింది. ఇప్పుడు, కిలో వెండి రూ. 76,200 వద్ద ఉంది. ఈ రెండు దశాబ్దాల్లో కిలో వెండి ధర రూ. 68,650 మేర పెరిగింది. శాతాల వారీగా చూస్తే.. 20 ఏళ్లలో వెండి ధర 900 శాతానికి పైగా పెరిగింది.
ఒక్క ఏడాదిలోనే 19 శాతం పైగా పెరిగిన ధరలు
20 ఏళ్ల క్రితానికి వెళ్లకుండా, కేవలం ఒక్క సంవత్సరం వెనుదిరిగి చూసినా బంగారం ధర ఆశ్చర్యపరుస్తుంది. 2022లో, అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 50,808గా ఉంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకు బంగారం ధర 19.20 శాతం లేదా 10 గ్రాములకు రూ. 9,760 పెరిగింది. బంగారం ధరల పరుగు ఇప్పుడప్పుడే ఆగదన్నది నిపుణుల అభిప్రాయం. అతి త్వరలోనే 10 గ్రాముల పసిడి ధర 10 గ్రాములకు రూ. 65,000 స్థాయిని తాకవచ్చని అంచనా.
బంగారం కొనుగోలు ఆప్షన్లు
ఆభరణాలు, కడ్డీలు, నాణేల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది సాధారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఇష్టపడే మార్గం. కానీ, GST, మేకింగ్ ఛార్జీలు వంటివి ఉంటాయి కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్న మార్గం. అంతే కాకుండా, షాపు వాళ్లు మనకు అమ్మే బంగారం స్వచ్ఛత గురించి ఆందోళన కూడా ఉంటుంది. ఇంట్లో కాస్త ఎక్కువ బంగారం ఉందంటే, దొంగల భయంతో సరిగా నిద్ర కూడా పట్టని రోజులివి. ఈ అదనపు ఖర్చు, ఆందోళనలకు విరుగుడుగా... బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా ఇతర ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. గోల్డ్ ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ (GSB), డిజిటల్ గోల్డ్. స్వచ్ఛత, నిల్వ, ఇతర ఛార్జీల గురించి ఆందోళన చెందకుండా, వీటిలో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు.
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Affordable Housing: అఫర్డబుల్ హౌసింగ్ పరిమితి రూ.80 లక్షలు, గృహ రుణ వడ్డీపై 100 శాతం పన్ను మినహాయింపు!
Saving Money: మీకు డబ్బు కొరత రానివ్వని ఆర్థిక సూత్రాలు - 5 తప్పులు అస్సలు చేయకండి
Investment Tips: SIP వర్సెస్ FD - ఎందులో మీరు ఎక్కువ లాభపడతారు?
Gold-Silver Prices Today 27 Nov: మళ్లీ పైచూపులు చూస్తున్న స్వర్ణం - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?