By: ABP Desam | Updated at : 10 Oct 2022 09:13 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
2000 Rupee Currency Notes: మీ వద్ద రూ.2,000 నోట్లు ఉన్నాయి. కాబట్టి ఆ నోటు నకిలీదా నిజమైనదా అని కచ్చితంగా తనిఖీ చేయండి. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో 60 శాతం రూ .2,000 కరెన్సీ నోట్లే. 2016లో 500, 1000 రూపాయల పాత నోట్లను నిషేధించిన తరువాత 2,000 రూపాయలు, 500 రూపాయల కొత్త నోట్లు జారీ చేశారని మీకు తెలిసిందే. నకిలీ కరెన్సీని నిర్మూలించడమే పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెప్పింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం, 2021లో మొత్తం రూ.20.39 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ .12.18 కోట్లకు సమానమైన నకిలీ నోట్లు రూ.2000. అంటే స్వాధీనం చేసుకున్న మొత్తం నోట్లలో 60 శాతం రూ.2,000 కరెన్సీయే. 2016తో పోలిస్తే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం పెరిగిందని ఎన్సీఆర్బీ తెలిపింది. 2016లో 15.92 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2017లో రూ.28.10 కోట్లు, 2019లో రూ.17.95 కోట్లు, 2020లో రూ.92.17 కోట్లు, 2021లో రూ.20.39 కోట్ల విలువైన నకిలీ నోట్లు గుర్తించారు.
దేశంలో 2,000 రూపాయల నోటు చలామణిలో భారీ తగ్గుదల కనిపించింది. 2020-21లో మొత్తం కరెన్సీ చెలామణిలో రూ.2,000 నోట్ల వాటా 17.3 శాతంగా ఉందని, అది ఇప్పుడు 13.8 శాతానికి పడిపోయిందని 2021-22 వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.
2019-20లో రూ.5,47,952 విలువ చేసే 2,73.98 కోట్ల 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని, ఇది మొత్తం నోట్ల చలామణిలో 22.6 శాతంగా ఉందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020-21లో రూ.245.10 కోట్ల నుంచి రూ.4,90,195 కోట్లకు తగ్గింది. కానీ 2021-22లో మొత్తం కరెన్సీ చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య రూ.4,28,394 కోట్ల విలువైన 214.20 కోట్లకు తగ్గింది. ఇప్పుడు చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య 2020-21లో 2 శాతం, 2019-20లో 2.4 శాతం నుంచి 2021-22లో 1.6 శాతానికి తగ్గింది.
మార్చి 31, 2018 నాటికి, 336.3 కోట్ల రూ .2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి, ఇది మొత్తం నోట్ల చలామణిలో 3.27 శాతం. విలువ పరంగా 37.26 శాతం. మార్చి 31, 2022 నాటికి 214.20 కోట్ల రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది మొత్తం నోట్లలో 1.6శాతం ఉంటే విలువ పరంగా 13.8 శాతానికి తగ్గింది.
వాస్తవానికి 2018-19 నుంచి రూ .2,000 నోట్ల ముద్రణ కోసం కొత్త ఉత్తర్వులు ఇవ్వలేదని 2021 డిసెంబర్లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. రూ.2,000 నోట్ల చెలామణి తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ, 2018-19 నుంచి నోట్లను ముద్రించడానికి కొత్తగా ఆర్డర్లు ఇవ్వలేదని, అందువల్ల 2,000 నోట్ల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల వల్ల జరుగుతున్న నష్టం వల్ల కూడా నోట్లు చెలామణిలో లేవు. దీని కారణంగా వాటి సంఖ్య తగ్గింది.
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్‌లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!