By: ABP Desam | Updated at : 30 Mar 2022 04:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
DA Hike: ముందే వచ్చిన ఉగాది! DA పెంపుకు కేంద్రం ఆమోదం.. ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతోందంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! డియర్ నెస్ అలవెన్స్ (DA) 3 శాతం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 31 శాతం డీఏ ఇస్తున్నారు. దీనిని మరో 3 శాతానికి పెంచడంతో డీఏ 34 శాతానికి చేరుతుంది. బడ్జెట్ రెండో దశ సమావేశాలకు ముందే కేబినెట్ సమావేశమైంది. అప్పుడే ఈ అంశం చర్చకు వచ్చింది. తాజాగా నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
DA ఎందుకిస్తారంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.
Also Read: ఐదో తేదీ వరకూ బ్యాంక్ వైపు వెళ్లకండి ! ఎందుకంటే ?
Also Read: ఈపీఎఫ్ అలర్ట్ - రూ.7 లక్షల బెనిఫిట్స్ పొందాలంటే ఇది తప్పనిసరి, మార్చి 31 డెడ్‌లైన్
డీఏ పెంచడం వల్ల కోటికి పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. చివరిసారిగా డీఏను గతేడాది అక్టోబర్లో సవరించారు. 28 నుంచి 31 శాతానికి పెంచారు. ఇప్పుడు డీఏ పెంచితే పెంచిన వేతనాల్లో జనవరి, ఫిబ్రవరి డీఏ బకాయిలు కూడా ఉంటాయి. ఎందుకంటే దీనిని 2022 జనవరి నుంచి అమలు చేస్తారు.
Cabinet approves release of an additional instalment of Dearness Allowance to Central Government employees and Dearness Relief to Pensioners, due from 01.01.2022.
— All India Radio News (@airnewsalerts) March 30, 2022
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్ కంపెనీ జోస్యం!
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్ చరణ్
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?