మనీ లాండరింగ్ కేసులో సినీ నటి, డ్యాన్సర్ నోరా ఫాతేహికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అక్రమ నగదు బదిలీకి సంబంధించి ఆమెను గురువారం ప్రశ్నించనున్నారు. సుకేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులోనే ఆమెను అధికారులు ప్రశ్నిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఆయన బలవంతపు వసూళ్ల కేసులో జైల్లో ఉన్నారు.
Also Read: జోరుగా హుషారుగా..! ఐటీ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ దూకుడు
ఇక రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌కూ సమన్లు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులోనే అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. దిల్లీలో నాలుగు గంటల పాటు పీఎంఎల్‌ఏ కేసులో విచారించారు. శుక్రవారం అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.
Also Read: త్వరపడండి..! బ్రాండెడ్ డైనింగ్ టేబుళ్లు రూ.12,000కే
2017లో చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఎన్నికల్లో శశికళ వర్గానికి 'రెండు ఆకులు' గుర్తు ఇప్పించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇచ్చేందుకు టీటీవీ దినకరన్ నుంచి ఆయన డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం నోరా ఫాతేహి సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. రాకీ హ్యాండ్‌సమ్, సత్యమేవ జయతే, స్ట్రీ, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, మర్జావన్ చిత్రాల్లో తన డ్యాన్సులతో మెప్పించింది. బిగ్‌బాస్ 9, జలక్ దిక్లాజా 9 వంటి రియాలిటీ షోల్లో అదరగొట్టింది. డాన్స్ దివానీ షోలో మాధురీ దీక్షిత్ బదులు కొన్ని ఎపిసోడ్లలో నోరా పాల్గొంది.
Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి