సంపాదించిన వేతనంలో కొంత డబ్బు మిగులుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వంటివి చేసినా కొంత ధనాన్ని పెట్టుబడులు పెట్టాలని చాలామంది అనుకుంటారు. అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలో? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో? తెలియక సతమతం అవుతుంటారు.
మరికొందరికి స్టాక్‌మార్కెట్‌పై ఇష్టం ఉన్నా.. నష్టభయంతో ముందడగు వేయరు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ సరైనవని నిపుణుల అభిప్రాయం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ప్రకారం పెట్టుబడుల పెడితే తక్కువ నష్టభయంతో ఎక్కువ లాభాల్ని పొందుచ్చు. అయితే సిప్ చేస్తున్నప్పుడు ఈ ఐదు విషయాలు తెలుసుకోవడం అత్యంత కీలకం.
Also Read: ఆదాయపన్ను రీఫండ్ రాలేదా? ఎప్పుడొస్తుందో తెలియడం లేదా? ఇలా స్టేటస్ తెలుసుకోవచ్చు
రిస్క్ ఎంత?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేముందు మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో ముందే నిర్ధారించుకోండి. తక్కువ నష్టభయం, మోతాదు నష్టభయం, ఎక్కువ నష్టభయంతో కూడిన ఫండ్స్ ఉంటాయి. మీరెంత భరించగలరో నిర్ధారించుకుంటే మీకు అనువైన ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టి తగిన రాబడి పొందొచ్చు. మోతాదు నష్టభయం ఉంటే బాలన్స్‌డ్ లేదా డైవర్సిఫైడ్ లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్ వారికి బాగుంటాయి.
లక్ష్యం ఏంటి?
రెండోది, మీ ఆర్థిక లక్ష్యం గుర్తించడం. ఇలా చేస్తే ఎలాంటి పథకం, ఎన్నేళ్లు, ఎన్నిసార్లు, ఎంత సిప్ చేస్తే బాగుంటుదో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల విద్య, అమ్మాయి పెళ్లి, ఇళ్లు కొనడం వంటి లక్ష్యాలు పెట్టుకుంటే తగిన ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సులువగా ఉంటుంది.
Also Read: మూడు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం-వెండి ధరలు, మీ నగరంలో బంగారం వెండి ధరలివే
ఫండ్ ఏంటి?
మీరు ఎంచుకున్న పథకం తీరుతెన్నులు, ఫలితాలు తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. ఫండ్ ఆరంభమైన ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల వారీగా సమీక్షించుకోవాలి. పోటీదారులతో పోలిస్తే ఎంత మెరుగ్గా ఉంది? ఎంత ఎక్కువ రాబడి వస్తుందో చూసుకోవాలి. ఆ ఫండ్ నిలకడగా రాబడి ఇస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
ఫండ్ హౌజ్ ఫర్వాలేదా?
ఫండ్‌ను ఎంచుకున్నాక ఆ ఫండ్ నిర్వాహకుల పనితీరు ఎలాంటిదో తెలుసుకోవాలి. ఫండ్ మేనేజర్ అనుభవం, ఫండ్ హౌజ్ క్రెడెన్షియల్స్ చూసుకోవాలి. పథకం ఏయుఎం పరీక్షించాలి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఫండ్ నిలకడగా రాబడి ఇస్తుంటుంది. దీనిని గమనించాలి.
Also Read: 350+లో సెన్సెక్స్.. 130+లో నిఫ్టీ.. నేడు ఆల్‌టైం హై పక్కానే!
ఖర్చులు తక్కువేనా?
ఫండ్ కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకోవాలి. ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే ఫండ్‌లో పెట్టుబడులు పెట్టేముందు, తీసుకొనే ముందు కొన్ని ఖర్చులు ఉంటాయి. మెరుగైన పనితీరు గల ఫండ్లలో వేటికి తక్కువ ఖర్చులు ఉన్నాయో తెలుసుకొంటే మరికొంత డబ్బు మిగులుతుంది. ఒక ఫండ్ కొనేముందు సెబీలో నమోదు చేసుకున్న సలహాదారును సంప్రదించడం మంచిది. పథకానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి.