ఆదాయ పన్ను పరిధిలో ఉన్నవారు ఏటా పన్ను రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. ఐటీఆర్‌ సమర్పించాక రీఫండ్‌ ఎప్పుడొస్తుందా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. స్టేటస్‌ ఏంటో తెలియక కంగారు పడుతుంటారు. అయితే ఐటీఆర్‌ ప్రక్రియ పూర్తయ్యాక దానిని ఆదాయ శాఖ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్‌ స్టేటస్‌ గురించి సందేశాలు పంపిస్తారు.

Also Read: నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 9 రోజులు సెలవులు.. ఈ నగరాల్లో ఏదైనా పనుంటే త్వరపడండి!

ఆదాయపన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 143 (1) ప్రకారం ఐటీఆర్‌ దాఖలు చేసిన ప్రతి ఒక్కరికీ  సందేశం పంపించాల్సిందే. కాగా 2020-21 ఆర్థిక ఏడాదికి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు చివరి తేదీని 2021, డిసెంబర్‌ 31కి పొడగించారు. 2021, సెప్టెంబర్‌ 30లోపు దాఖలు చేయని వ్యక్తులు ఇప్పుడు ఐటీఆర్‌ సమర్పించొచ్చు.

ఇప్పుడు ఆదాయపన్నును ఆన్‌లైన్‌ లేదా మొబైల్లోనే దాఖలు చేసేందుకు అనేక వెసులుబాట్లు, సౌకర్యాలు ఉన్నాయి. తమ యోనో యాప్‌లో టాక్స్‌2విన్‌ ఆప్షన్‌ ద్వారా ఐటీఆర్‌ దాఖలు చేసుకోవచ్చని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ తమ వినియోగదారులకు తెలియజేసింది. 'మీరు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలనుకుంటున్నారా? యోనోలో టాక్స్‌2విన్‌ ద్వారా ఉచితంగా మీరా పని చేయొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా కేవలం ఐదు డాక్యుమెంట్లు మాత్రమే' అని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

Also Read: దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ రంగం.. త్వరలో యూకేని కూడా దాటేసి.. త్వరలో టాప్ 5లో చోటు!

ఆదాయపన్ను రీఫండ్‌ స్టేటస్‌ తెలుసుకొనేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఇన్‌కం టాక్స్‌ సరికొత్త పోర్టల్‌ లేదా ఎన్‌ఎల్‌డీఎల్‌ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వడం.

ఇన్‌కం టాక్స్‌ పోర్టల్‌లో..1. మొదట www.incometax.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత మీ యూజర్‌ ఐడీ (పాన్‌), పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్‌ అవ్వాలి.2. ఆ తర్వాత 'e-file' ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.3. ‘Income tax returns’లో వెళ్లి ‘View Filed returns'ను సెలెక్ట్‌ చేసుకోవాలి.4. ఇప్పుడు తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఎంచుకోవాలి.5. 'View Details' క్లిక్‌ చేయగానే మీ ఐటీఆర్‌ స్టేటస్‌ ఏంటో కనిపిస్తుంది.

Also Read: 6 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది ఎప్పుడో తెలుసా!

టీఐఎన్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌లో..1. https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html లింక్‌ను ఓపెన్‌ చేయాలి.2. పాన్‌ కార్డు వివరాలు ఎంటర్‌ చేయాలి.3. స్టేటస్‌ తెలుసుకోవాలనుకుంటున్న సంవత్సరాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి.4. క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ రీఫండ్‌ స్టేటస్‌ వివరాలు వచ్చేస్తాయి.ఒక వేళ మీ ఆదాయపన్ను రీఫండ్‌ క్రెడిట్‌ అవ్వకపోతే సర్వీసెస్‌లోకి వెళ్లి 'Refund Reissue'ను క్లిక్‌చేయడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి