భారత స్టాక్ మార్కెట్లు దుమ్మురేపుతున్నాయి. బుల్ సరికొత్త గరిష్ఠాల వైపు రంకెలేస్తోంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు సానుకూలంగా ఉండటంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. గురువారం వారాంతపు ఎఫ్ అండ్ వో ముగుస్తున్నప్పటికీ సూచీలు పైపైకి పరుగులు తీస్తున్నాయి.
Also Read: ఆదాయపన్ను రీఫండ్ రాలేదా? ఎప్పుడొస్తుందో తెలియడం లేదా? ఇలా స్టేటస్ తెలుసుకోవచ్చు
మంగళవారం 60,284 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ బుధవారం ఉదయం 300 పాయింట్లకు పైగా గ్యాప్ అప్‌తో మొదలైంది. ప్రస్తుతం 357 పాయింట్ల లాభంతో 60,641 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు 17,991 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉదయం 18,097 వద్ద ఆరంభమైంది. మరింత పైపైకి వెళ్తూ 133 పాయింట్ల లాభంతో 18,126 వద్ద కదలాడుతోంది. ఈ రోజు ఆల్‌టైం హై సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: మూడు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం-వెండి ధరలు, మీ నగరంలో బంగారం వెండి ధరలివే
టాటా మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహనాల విభాగంలో రూ.7500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు టీపీజీ రైజ్ క్లైమేట్, అబుదాబి ఏడీక్యూ సిద్ధమవ్వడంతో టాటా సంస్థల షేర్లు బుధవారం పరుగులు పెడుతున్నాయి. టాటా మోటార్స్ షేరు ఏకంగా 18 శాతం పెరిగి రూ.497 వద్ద కొనసాగుతోంది. ఎం అండ్ ఎం, టైటాన్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ రెండు శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హిందుస్థాన్ యునీలివర్,ఐటీసీ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఇతర రంగాల సూచీలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Also Read: బ్యాంకులకు వరుసగా 9 రోజులు సెలవులు.. ఈ నగరాల్లో ఏదైనా పనుంటే త్వరపడండి!
Also Read: దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ రంగం.. త్వరలో యూకేని కూడా దాటేసి.. త్వరలో టాప్ 5లో చోటు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి