By: ABP Desam | Updated at : 07 Oct 2022 08:48 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే - 07 అక్టోబరు 2022
Stocks to watch today, 07 October 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 34.5 పాయింట్లు లేదా 0.20 శాతం రెడ్ కలర్‌లో 17,281 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: రెండేళ్ల క్రితం చేపట్టిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వర్క్‌ను సగానికి పైగా పూర్తి చేసింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ చేస్తున్న మిగిలిన ఖర్చులతో పోలిస్తే, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఎక్కువగా వ్యయం చేస్తోంది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: డిజిటల్ సేవలను వేగవంతం చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పొడిగించింది. గూగుల్ క్లౌడ్‌లో 18,000 మంది సాంకేతికత, కన్సల్టింగ్ నిపుణులకు హెచ్‌సీఎల్ టెక్ శిక్షణ ఇస్తుంది.
టైటన్: సెప్టెంబర్ త్రైమాసికంలో తమ మొత్తం అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగాయని ఈ టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. ఆభరణాలు, గడియారాలు & వేరబుల్స్, ఐ కేర్ విభాగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ చాలా వ్యాపారాల్లో రెండంకెల వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తన రిటైల్ నెట్‌వర్క్‌కు మరో 105 స్టోర్లను జోడించింది.
NTPC: గుజరాత్‌లోని 645 మెగావాట్ల కవాస్ గ్యాస్ పవర్ ప్లాంట్‌లో కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం GE గ్యాస్ పవర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
బ్రిటానియా ఇండస్ట్రీస్: కెన్యాకు చెందిన కెనాఫ్రిక్ బిస్కెట్స్‌లో మెజారిటీ వాటా బ్రిటానియా చేతికి వచ్చింది. ఫలితంగా అక్కడ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, ఆఫ్రికన్ మార్కెట్లలో విక్రయాలను విస్తరించడానికి వీలవుతుంది. బ్రిటానియాకు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన బ్రిటానియా అండ్ అసోసియేట్స్ దుబాయ్ (BADCO) 51 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది.
యెస్ బ్యాంక్: గురువారం నుంచి అమల్లోకి వచ్చేలా, మూడేళ్ల కాల పరిమితితో, యెస్ బ్యాంక్ MD & CEOగా ప్రశాంత్ కుమార్ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది. ఈ నియామకానికి ఆమోదముద్ర కోసం గత జులైలో యెస్ బ్యాంక్ బోర్డు రిజర్వ్ బ్యాంక్‌కు ఫైల్‌ను పంపింది.
FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa): గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్‌లో ఓమ్ని-చానెల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్‌ను రీక్రియేట్ చేయడానికి, మిడిల్ ఈస్ట్‌కు చెందిన అపెరల్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యూటీ & లైఫ్‌స్టైల్ రిటైలర్ నైకా తెలిపింది.
మాక్రోటెక్ డెవలపర్స్ (Lodha): వడ్డీ రేటు పెరిగినప్పటికీ, జులై-సెప్టెంబర్ త్రైమాసికం అమ్మకాల బుకింగ్స్‌లో 57 శాతం వృద్ధిని సాధించింది, రూ.3,148 కోట్లకు చేరుకుంది. లోధ బ్రాండ్‌తో ఈ కంపెనీ తన ఆస్తులను విక్రయిస్తుంది.
క్వెస్ కార్ప్: సింప్లియన్స్ టెక్నాలజీస్‌లో (Simpliance Technologies) తన మొత్తం వాటాను హెచ్‌ఆర్ కంప్లైయన్స్ సర్వీస్ ఫర్మ్ అయిన అపరాజిత కార్పొరేట్ సర్వీసెస్‌కు (Aparajitha Corporate Services) రూ.120 కోట్ల ఎంటర్‌ప్రైజ్ వాల్యూకు విక్రయించింది. క్యాష్ అండ్ డెట్ ఫ్రీ ప్రాతిపదికన ఈ ఒప్పందం ఖరారైంది.
HFCL: 5G ఔట్ డోర్ స్మాల్ సెల్ ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి కోసం క్వాల్కమ్ టెక్నాలజీస్‌తో (Qualcomm Technologies) ఒప్పందం చేసుకుంది. 5G ఔట్ డోర్ స్మాల్ సెల్ ఉత్పత్తుల వల్ల, 5G నెట్‌వర్క్‌ను వేగవంతంగా ప్రజల్లోకి తీసుకురావడం, మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడం, 5G స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది.
పూనావాలా ఫిన్‌కార్ప్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) మొత్తం డిజ్‌బర్స్‌మెంట్లు 44 శాతం పెరిగాయి. సీక్వెన్షియల్‌గానూ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిజ్‌బర్స్‌మెంట్లు 8 శాతం పెరిగాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.3,720 కోట్లు.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంక్ స్థూల రుణ పుస్తకం 44 శాతం వృద్ధితో, రూ. 20,938 కోట్లకు చేరుకుంది. తక్కువ వడ్డీ రేట్లకు అందుబాటులో ఉన్న గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు