By: Arun Kumar Veera | Updated at : 22 Apr 2024 08:41 AM (IST)
డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
What Is A Debt Fund: ఈక్విటీ మార్కెట్‌లో నేరుగా కాకుండా, ఇన్‌డైరెక్ట్‌గా పెట్టుబడి పెట్టే మార్గం మ్యూచువల్ ఫండ్స్. ప్రత్యక్ష పెట్టుబడులతో పోలిస్తే వీటిలో రిస్క్ తక్కువ. మార్కెట్‌లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇన్వెస్టర్ మనస్థత్వం, ఆర్థిక లక్ష్యానికి తగ్గ ఫండ్‌ను ఎంచుకోవడం ఇప్పటికీ ఒక సవాలే.
డెట్ ఫండ్ అంటే ఏంటి?
డెట్ మ్యూచువల్ ఫండ్స్ వాటి పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని ఇన్‌కమ్ ఫండ్స్ లేదా బాండ్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి స్థిర ఆదాయ సెక్యూరిటీల్లో ఇవి పెట్టుబడి పెడతాయి. వీటిని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.
సరైన డెట్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?
- డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీ ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా, డెట్ ఫండ్స్ సురక్షితమైన పెట్టుబడి ఎంపికే అయినప్పటికీ, వీటిలో రాబడి వృద్ధి మితంగా ఉంటుంది. కాబట్టి, ఈ సెగ్మెంట్‌లోకి దిగడానికి ముందు, మీ ఆర్థిక లక్ష్యాలను ఇవి పూర్తి చేయగలవో, లేవో అంచనా వేయండి. క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే, ఏ మ్యూచువల్ ఫండ్‌లోనైనా మంచి సంపద సృష్టించవచ్చు.
- దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీ రేట్లు, ఇతర ఆర్థిక విషయాలు, మార్కెట్ కదలికలు కలిసి డెట్ ఫండ్ పనితీరును ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఈ విషయాలపైనా మీకు కొద్దిగానైనా అవగాహన ఉండడం అవసరం. లేదంటే, మీ పెట్టుబడి పరిస్థితి గాల్లో దీపంలా మారుతుంది.
- మీ రిస్క్ టాలరెన్స్‌ను అర్థం చేసుకోవడం కూడా కీలకమే. అంటే, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు (ఎంత నష్టాన్ని భరించగలరు) అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సాధారణంగా, తక్కువ రేటింగ్ ఉన్న బాండ్స్ ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తాయి. వీటిలో రిస్క్ ఎక్కువ. మెరుగైన రేటింగ్ ఉన్న బాండ్స్ తక్కువ వడ్డీ చెల్లిస్తాయి. వీటిలో రిస్క్ తక్కువ.
- ప్రతి పెట్టుబడికి ఒక గోల్ ఉండాలి. కారు కొనడం వంటి స్వల్పకాలిక లక్ష్యమైనా కావచ్చు, రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టాలన్న దీర్ఘకాలిక లక్ష్యమైనా కావచ్చు. ఆ టార్గెట్ వైపు మిమ్మల్ని నడిపించేలా మీ పెట్టుబడి నిర్ణయం ఉండాలి.
- వడ్డీ రేటు అంచనాల ఆధారంగా దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక బాండ్లలో మేనేజర్లు పెట్టుబడి పెడతారు. డెట్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఫండ్ మేనేజర్ చురుగ్గా వ్యవహరించాలి. మార్కెట్ పోకడను ముందుగానే అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి, మీరు ఎంచుకున్న ఫండ్‌ను నిర్వహించే మేనేజర్ ఎవరు, అతని చరిత్ర ఏంటి అన్నది కూడా ముఖ్యమే.
- పెట్టుబడుల్లో విభిన్నత ప్రదర్శించడం తెలివైన వ్యక్తులు చేసే పని. సంపద నిర్వహణకు ఇదే మూలం. డబ్బులన్నీ తీసుకెళ్లి ఒకే రకమైన ఫండ్‌లో పెట్టకూడదు. క్రెడిట్, వడ్డీ రేటు నష్టాలను తగ్గించడానికి పోర్ట్‌ఫోలియోలో విభిన్న ఫండ్స్‌ను చేర్చాలి. దీనివల్ల.. ఒక ఫండ్ నష్టంలోకి జారుకున్నా మరొక స్కీమ్ ఆదుకుంటుంది, మీ పెట్టుబడులను రక్షిస్తుంది.
మొదటిసారి చూసినప్పుడు డెట్ ఫండ్స్ కొరుకుడుపడని కొయ్యలా అనిపించవచ్చు. కానీ, ఈక్విటీ మార్కెట్‌తో పోలిస్తే డెట్ మార్కెట్ ఎన్నో రెట్లు పెద్దది. కొన్ని చిన్నపాటి సూత్రాలను అర్ధం చేసుకుంటే చాలు, మీరు కూడా తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు, మీ పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: నేటి బంగారం, వెండి ధరలు ఇవే - దుబాయ్‌లో బాగా చౌక, ధర ఎంతంటే?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రత్యేక ఫార్ములా - యవ్వనం కంటే వృద్ధాప్యంలో ఎక్కువ సంపాదన!
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు