By: ABP Desam | Updated at : 15 Jun 2022 12:48 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market @12 Pm on 15 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం రేంజ్ బౌండ్‌లో కదలాడుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సెంటిమెంటు కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్ల లాభంతో 15,767, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 122 పాయింట్ల లాభంతో 52,816 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 52,693 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,650 వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. 52,538 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,819 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 122 పాయింట్ల లాభంతో 52,816 వద్ద కదలాడుతోంది.
NSE Nifty
మంగళవారం 15,732 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,729 వద్ద ఓపెనైంది. 15,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,780 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 35 పాయింట్ల లాభంతో 15,767 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు లాభాల్లో ఉంది. ఉదయం 33,317 వద్ద మొదలైంది. 33,249 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 180 పాయింట్ల లాభంతో 33,491 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, కోల్ ఇండియా, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్, ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లోనే ఉన్నాయి. కన్జూమర్ డ్యురబుల్స్, ఫార్మా, బ్యాంకు, ఆటో షేర్లకు గిరాకీ ఉంది.
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Monthly Income: మ్యూచువల్ ఫండ్ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్
Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Mutual Fund SIPs: 'సిప్' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు
Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్ వచ్చాయి, సిప్ చేసిన మ్యాజిక్ ఇది
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>