search
×

Stock Market Opening: పడిపోయిన ఐటీ స్టాక్స్‌! ఒడుదొడుకుల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Opening Bell 23 August 2022: రెండు రోజుల భారీ నష్టాలకు చెక్‌! భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అతి స్వల్ప లాభాల్లో ఓపెనయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening Bell 23 August 2022: రెండు రోజుల భారీ నష్టాలకు చెక్‌! భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అతి స్వల్ప లాభాల్లో ఓపెనయ్యాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలేమీ లేవు. డాలర్‌ మళ్లీ పుంజుకోవడం, క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 10 పాయింట్ల లాభంతో 17,497 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 5 పాయింట్ల లాభంతో 58,778 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 58,789 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,205 వద్ద మొదలైంది. 58,172 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,068 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 5 పాయింట్ల లాభంతో 58,778 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

సోమవారం 17,490 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,357 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,558 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 10 పాయింట్ల లాభంతో 17,497 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌  స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 37,955 వద్ద మొదలైంది. 37,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,569 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 101 పాయింట్ల లాభంతో 38,399 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌, సిప్లా, గ్రాసిమ్‌, ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 23 Aug 2022 10:49 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy