search
×

Stock Market News: బలం లేని మార్కెట్లు! 16 వేల దిగువకు నిఫ్టీ, నష్టాల్లో సెన్సెక్స్‌

Stock Market Closing Bell 14 July 2022: స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 28 పాయింట్ల నష్టంతో 15,938 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 14 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు అందకపోవడంతో సూచీల్లో బలం కనిపించడం లేదు. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 28 పాయింట్ల నష్టంతో 15,938, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 98 పాయింట్ల నష్టంతో 53,416 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 53,514 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,688 వద్ద లాభాల్లో మొదలైంది. 53,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,861 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 200 పాయింట్ల మేర లాభపడ్డ సూచీ ఆఖరికి 98 పాయింట్ల నష్టంతో 53,416 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 15,966 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,018 వద్ద ఓపెనైంది. 15,853 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,070 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 28 పాయింట్ల లాభంతో 15,938 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 34,817 వద్ద మొదలైంది. 34,558 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,027 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 176 పాయింట్ల నష్టంతో   34,651 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరోమోటో కార్ప్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా సూచీలు లాభపడ్డాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌ సూచీలు ఎగిశాయి. 

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 14 Jul 2022 03:50 PM (IST) Tags: Stock Market Update share market stock market today Stock Market Telugu Stock Market news

ఇవి కూడా చూడండి

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Loan On Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!

Loan On Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి