By: ABP Desam | Updated at : 30 Jun 2022 03:49 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell 30 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల చివరి రోజు కావడంతో సూచీలు ఆద్యంతం ఊగిసలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్ల నష్టంతో 15,780, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 8 పాయింట్ల లాభంతో 53,018 వద్ద ముగిశాయి. క్రితం రోజు 78.96 వద్ద ముగిసిన రూపాయి నేడు 78.97 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 53,026 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,897 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,883 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,377 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 8 పాయింట్ల నష్టంతో 53,018 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 15,799 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,774 వద్ద ఓపెనైంది. 15,728 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,890 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 18 పాయింట్ల నష్టంతో 15,780 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 33,180 వద్ద మొదలైంది. 33,179 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,659 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 155 పాయింట్ల లాభంతో 33,425 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, సిప్లా, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీసెమ్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, మెటల్, రియాల్టీ రంగాల సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువగా పతనం అయ్యాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్