search
×

Stock Market News: నవ్విన మదుపరి! ఊహించని లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market @ 12 PM 5 July 2022: స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల లాభంతో 16,020 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Stock Market @ 12 PM 5 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు మెరుగ్గా ట్రేడువుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల లాభంతో 16,020, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 615 పాయింట్ల లాభంతో 53,955 వద్ద ఉన్నాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 53,234 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,501 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. 53,437 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 615 పాయింట్ల లాభంతో 53,955 వద్ద కొనసాగుతోంది. 

NSE Nifty

సోమవారం 15,835  వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,909 వద్ద ఓపెనైంది. 15,899 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,025 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 187 పాయింట్ల లాభంతో 16,020 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 34,084 వద్ద మొదలైంది. 34,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34355 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్న 399 పాయింట్ల లాభంతో 34,339 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, అపోలో హాస్పిటల్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్సీ లైఫ్‌, మారుతి, హీరోమోటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, రియాల్టీ, మెటల్‌, బ్యాంక్‌ సూచీలు 1-2 శాతానికి పైగా ఎగిశాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 05 Jul 2022 12:47 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం