By: ABP Desam | Updated at : 20 Jul 2022 10:35 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market Opening Bell 20 July 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎగుమతి పన్ను తగ్గింపుతో ఆయిల్ కంపెనీ షేర్లు పరుగెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 201 పాయింట్ల లాభంతో 16,541, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 700 పాయింట్ల లాభంతో 55,469 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా ఓపెనైంది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,767 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,486 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,313 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,523 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 700 పాయింట్ల లాభంతో 55,469 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 16,340 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,562 వద్ద ఓపెనైంది. 16,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,565 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 201 పాయింట్ల లాభంతో 16,541 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 36,067 వద్ద మొదలైంది. 35,914 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,154 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 346 పాయింట్ల లాభంతో 36,067 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 47 కంపెనీలు లాభాల్లో 3 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, రిలయన్స్, టెక్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ సూచీ స్వల్ప నష్టాల్లో ఉంది. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని