By: ABP Desam | Updated at : 11 Aug 2022 03:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing Bell 11 August 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ప్రధాన సూచీలు నిరోధాల్ని అధిగమించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 124 పాయింట్ల లాభంతో 17,659 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 515 పాయింట్ల లాభంతో 59,332 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్లు నేడు రూ.2.5 లక్షల కోట్ల మేర పోగేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా బలపడి 79.70 వద్ద క్లోజైంది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,817 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,320 వద్ద మొదలైంది. 59,320 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 515 పాయింట్ల లాభంతో 59,332 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 17,534 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,711 వద్ద ఓపెనైంది. 17,631 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,719 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 124 పాయింట్ల లాభంతో 17,659 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 38,712 వద్ద మొదలైంది. 38,648 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,932 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 592 పాయింట్ల లాభంతో 38,879 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్సీ, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఐటీ,మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదని ఆక్షేపణ
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!