By: ABP Desam | Updated at : 12 Oct 2022 03:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market Closing 12 October 2022: మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో ఉదయం ఫ్లాట్‌గా ఓపెనయ్యాయి. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్ మార్క్ సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్ల లాభంతో 17,123 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 478 పాయింట్ల లాభంతో 57,625 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.31 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,147 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,312 వద్ద లాభాల్లో మొదలైంది. 57,085 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,687 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 478 పాయింట్ల లాభంతో 57,625 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 16,983 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,025 వద్ద ఓపెనైంది. 16,960 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,142 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 140 పాయింట్ల లాభంతో 17,123 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 38,784 వద్ద మొదలైంది. 38,606 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,164 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 406 పాయింట్ల లాభంతో 39,118 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !