By: ABP Desam | Updated at : 29 Jun 2022 11:12 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Opening Bell 29 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. రూపాయి విలువ పడిపోతుండటంతో మదుపర్లలో ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల నష్టంతో 15,752, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 292 పాయింట్ల నష్టంతో 52,881 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,177 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,623 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,612 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,973 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 292 పాయింట్ల నష్టంతో 52,881 వద్ద కొనసాగుతోంది. మంగళవారం సైతం సూచీ గ్యాప్‌డౌన్‌తోనే ఓపెనవ్వడం గమనార్హం.
NSE Nifty
మంగళవారం 15,850 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,701 వద్ద ఓపెనైంది. 15,687 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 33,273 వద్ద మొదలైంది. 33,185 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,342 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 368 పాయింట్ల నష్టంతో 33,274 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో ఉన్నాయి. గ్రాసిమ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సెమ్, టాటా స్టీల్, హీరోమోటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందుస్థాన్ యునీలివర్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సిప్లా, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా మేజర్ సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగతా సూచీలన్నీ పతనం అవుతున్నాయి. కన్జూమర్ డ్యురబుల్స్, హెల్త్‌కేర్, బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లను ఎక్కువగా అమ్ముతున్నారు.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?