By: ABP Desam | Updated at : 07 Jul 2022 10:49 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్, ( Image Source : Getty )
Stock Market Opening Bell 7 July 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడం, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలు మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటు పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్ల లాభంతో 16,106, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 366 పాయింట్ల లాభంతో 54,119 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,750 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,146 వద్ద లాభాల్లో మొదలైంది. 53,980 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,249 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 366 పాయింట్ల లాభంతో 54,119 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 15,989 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,113 వద్ద ఓపెనైంది. 16,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 114 పాయింట్ల లాభంతో 16,106 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 34,625 వద్ద మొదలైంది. 34,553 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,703 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 333 పాయింట్ల లాభంతో 34,657 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్, ఎం అండ్ ఎం, ఏసియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా నష్టాల్లో ఉన్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. కన్జూమర్ డ్యురబుల్స్, రియాల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?