By: ABP Desam | Updated at : 15 Sep 2022 10:43 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 15 September 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడమే ఇందుకు కారణం. కీలక సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, మీడియా షేర్లను తెగనమ్ముతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 41 పాయింట్ల నష్టంతో 17,962 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 122 పాయింట్ల నష్టంతో 60,224 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,346 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,454 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 60156 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,676 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 122 పాయింట్ల నష్టంతో 60,224 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 18,003 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,046 వద్ద ఓపెనైంది. 17,941 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 41 పాయింట్ల నష్టంతో 17,962 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,533 వద్ద మొదలైంది. 41,355 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,840 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 3 పాయింట్ల లాభంతో 41,409 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, ఐచర్ మోటార్స్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ సూచీలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు