search
×

Stock Market @12 PM: బ్రేకౌట్‌కు రెడీగా సూచీలు! ఎగిసిన పీఎస్‌యూ బ్యాంకు సూచీ!

Stock Market @12 PM, 09 November 2022: స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. కీలక సూచీలు బ్రేకౌట్‌ స్థాయిల్లో ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Stock Market @12 PM, 09 November 2022: స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలే వచ్చాయి. కీలక సూచీలు బ్రేకౌట్‌ స్థాయిల్లో ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పీఎస్‌యూ బ్యాంకు సూచీ మాత్రం ఆకాశమే హద్దుగా సాగుతోంది. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్ల నష్టంతో 18,177 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 109 పాయింట్ల నష్టంతో 61,075 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 61,185 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,304 వద్ద మొదలైంది. 61,043 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,447 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 109 పాయింట్ల నష్టంతో 61,075 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

సోమవారం 18,202 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,288 వద్ద ఓపెనైంది. 18,167 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,296 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 25 పాయింట్ల నష్టంతో 18,177 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,914 వద్ద మొదలైంది. 41,688 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,939 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 45 పాయింట్ల లాభంతో 41,732 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, దివిస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ సూచీ అత్యధికంగా 3.39 శాతం లాభపడగా హెల్త్‌కేర్‌ సూచీ 0.98 శాతం పతనమైంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 09 Nov 2022 12:37 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?

Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?

Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?

Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?

IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ

IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ

GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం

GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం