By: ABP Desam | Updated at : 22 Jun 2022 03:54 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell 22 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం రక్తమోడాయి! ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా, ఐరోపా మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సరఫరా కొరత, ధరల పెరుగుదలతో కంపెనీల మార్జిన్లు దెబ్బతింటున్నాయి. ఫలితంగా బెంచ్ మార్క్ సూచీలు పతనం అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 225 పాయింట్ల నష్టంతో 15,413, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 709 పాయింట్ల నష్టంతో 51,822 వద్ద ముగిశాయి. రూపాయి తాజా కనిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే 78.38 వద్ద కొనసాగుతోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 52,532 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,186 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 51,739 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,272 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 709 పాయింట్ల నష్టంతో 51,822 వద్ద ముగిసింది. ఎర్లీ ట్రేడ్‌లో 520 పాయింట్ల మేర నష్టపోయిన సూచీ ఆ తర్వాత కాస్త కోలుకుంది. మళ్లీ ఐరోపా మార్కెట్లు తెరవగానే ఢమాల్ అయింది.
NSE Nifty
మంగళవారం 15,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,545 వద్ద ఓపెనైంది. 15,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,565 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 225 పాయింట్ల నష్టంతో 15,413 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,051 వద్ద మొదలైంది. 32,758 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,106 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 346 పాయింట్ల నష్టంతో 32,845 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్, హీరోమోటోకార్ప్ దివీస్ ల్యాబ్, టీసీఎస్, పవర్ గ్రిడ్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. యూపీఎల్, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ షేర్లు 3-6 శాతం వరకు పతనమయ్యాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. మెటల్ సూచీ 4 శాతానికి పైగా పతనమైంది. ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, రియాల్టీ, బ్యాంక్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ 1-2 శాతం వరకు నష్టాలు చవిచూశాయి.
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత