By: ABP Desam | Updated at : 19 Oct 2022 04:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market Closing 19 October 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందాయి. మదుపర్లు కాస్త లాభాల స్వీకరణకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్ల లాభంతో 17,512 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 146 పాయింట్ల లాభంతో 59,107 వద్ద ముగిశాయి. నిన్నటి ముగింపు 82.36తో రూపాయి బలహీనపడి 83.02 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,960 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,196 వద్ద లాభాల్లో మొదలైంది. 58,961 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,399 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 146 పాయింట్ల లాభంతో 59,107 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,486 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,568 వద్ద ఓపెనైంది. 17,472 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,607 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు లాభాల్లో ముగిసింది. ఉదయం 40,557 వద్ద మొదలైంది. 40,195 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 54 పాయింట్ల లాభంతో 40,373 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తగ్గాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy