By: ABP Desam | Updated at : 26 Jul 2022 10:24 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell 26 July 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా ఫెడ్ సమీక్ష, వడ్డీరేట్ల పెంపు వంటి ఈవెంట్లు ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 115 పాయింట్ల నష్టంతో 16,515 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 390 పాయింట్ల నష్టంతో 55,376 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,834 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,376 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,834 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 390 పాయింట్ల నష్టంతో 55,376 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 16,631 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,632 వద్ద ఓపెనైంది. 16,513 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 115 పాయింట్ల నష్టంతో 16,515 వద్ద కదలాడుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లోనే ఉంది. ఉదయం 36,688 వద్ద మొదలైంది. 36,428 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 286 పాయింట్ల నష్టంతో 36,440 వద్ద ట్రేడువుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు నేల చూపులే చూస్తున్నాయి. ఐటీ, బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ ఎక్కువ నష్టపోయాయి.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం