search
×

Stock Market Closing: బుల్‌ రైడ్‌! కోట్లు కురిపించిన మంగళవారం! సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

Stock Market Closing: భారత స్టాక్‌ మార్కెట్లలో మంగళవారం కనక వర్షం కురిసింది! బెంచ్‌మార్క్‌ సూచీలు మరోసారి కీలక స్థాయిలు అందుకున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 20 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లలో మంగళవారం కనక వర్షం కురిసింది! బెంచ్‌మార్క్‌ సూచీలు మరోసారి కీలక స్థాయిలు అందుకున్నాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, టెక్నికల్‌గా సూచీలు బలంగా ఉండటంతో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 900 పాయింట్ల మేర పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.5 లక్షల కోట్లు పెరిగింది. ఆఖర్లో లాభాల స్వీకరణకు దిగడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 194 పాయింట్ల లాభంతో 17,816 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 578 పాయింట్ల లాభంతో 59,719 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 59,556 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,141 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 59,556 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,105 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 578 పాయింట్ల లాభంతో 59,719 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1000 పాయింట్ల మేర లాభపడటం గమనార్హం. 

NSE Nifty

సోమవారం 17,622 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,770 వద్ద ఓపెనైంది. 17,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,919 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 194 పాయింట్ల లాభంతో 17,816 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో క్లోజైంది. ఉదయం 41,304 వద్ద మొదలైంది. 41,207 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,677 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 563 పాయింట్ల లాభంతో 41,468 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ముగిశాయి. అపోలో హాస్పిటల్స్‌, సిప్లా, సన్‌ఫార్మా, ఐచర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, శ్రీసెమ్‌, గ్రాసిమ్‌, పవర్‌ గ్రిడ్‌, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1-3 శాతం వరకు లాభపడ్డాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 20 Sep 2022 03:35 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

Mutual Funds: సిప్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ను మిస్‌ చేసినా పెనాల్టీ తప్పించుకోవచ్చు, రెండు దార్లున్నాయి

Mutual Funds: సిప్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ను మిస్‌ చేసినా పెనాల్టీ తప్పించుకోవచ్చు, రెండు దార్లున్నాయి

టాప్ స్టోరీస్

Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ

Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ

Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్

Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్

Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్

Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని