By: ABP Desam | Updated at : 11 May 2022 12:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market @ 12 PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లలో అస్థిరత్వం చోటు చేసుకోవడం, ద్రవ్యోల్బణం భయాలు, ఎకానమీ మందగమనంలో ఉండటం మదుపర్లను భయపెడుతోంది. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి వల్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,118 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 391 పాయింట్లు నష్టపోయింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,364 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,544 వద్ద లాభాల్లో మొదలైంది. 54,598 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో 53,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త తేరుకొని 391 పాయింట్ల నష్టంతో 53,974 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,318 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడింది. 16,318 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 16,071 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 121 పాయింట్ల నష్టంతో 16,118 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అయింది. ఉదయం 34,686 వద్ద మొదలైంది. 34,296 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,727 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 50 పాయింట్ల లాభంతో 34,432 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభపడగా 37 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీసెమ్, ఎల్‌టీ, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, పవర్, ఐటీ సూచీలు ఒక శాతం వరకు తగ్గాయి.
Kotak Mutual Fund: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Stock Market News: అలల్లా ఎగిసి వెంటనే పడ్డ స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 215, నిఫ్టీ 100 డౌన్
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!